ETV Bharat / state

'రైతు భరోసా' డబ్బులు ఈరోజు రావు - ఖాతాల్లోకి నగదు బదిలీ ఎప్పుడంటే? - RYTHU BHAROSA SCHEME IN TELANGANA

రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకం నేడు ప్రారంభం - ఈ సీజన్ నుంచి ఎకరాకు రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.12 వేలు

Rythu Bharosa Scheme
Rythu Bharosa Scheme In Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2025, 10:48 AM IST

Rythu Bharosa Scheme In Telangana : రైతు భరోసా పధకం నేడు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. అర్హులైన రైతులకు ఎకరాల ప్రకారం పెట్టుబడి సాయం రేపటి నుంచి వారి ఖాతాల్లో నేరుగా జమ కానుంది. ఆదివారం గణతంత్ర వేడుకల సందర్బంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభిస్తారు.

కొత్తవారికి అవకాశం : కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందడం, గతంలో బ్యాంక్ ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్​సీ కోడ్ తప్పుపడటం, ఖాతా నిర్వహణ లేకపోవడం వంటి సమస్యలతో వేలాది మందికి రైతుబంధు నిలిచిపోయేది. ఇప్పుడా సమస్యల్ని సరిచేసుకొని సంబంధిత పత్రాలను క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారుల వద్ద సమర్పించేందుకు ఈ నెలాఖరు వరకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ వివరాలను పరిశీలించి అర్హులకు పెట్టుబడి సాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ చిట్టా రెండు మూడు రోజుల్లో సిద్ధం : ఇటీవలే రాష్ట్రంలో గ్రామాల వారీగా చేపట్టిన సర్వేలో నంబర్ల వారీగా సాగుకు పనికిరాని భూములను గుర్తించారు. ఆ విస్తీర్ణం వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు పోర్టల్ నుంచి తీసివేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తహసీల్దార్లు, సీసీఎల్ఏకు చెందిన జాబితాల్లోనూ ఈ వివరాలు పొందుపరుస్తున్నారు.

కేవలం సేద్యం చేయడం లేదని మాత్రమే జాబితాలో పేర్కొంటారు కానీ పట్టా భూముల వివరాల్లో ఎలాంటి తేడాలు ఉండవు. ఒకే సర్వే నంబరులో కొంత సాగుయోగ్యమైనది, మరికొంత సాగుకు యోగ్యం కాని భూమి ఉన్నప్పుడు ఆ వివరాలను తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు విభజిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ పని పూర్తి కానున్నట్లు వారు తెలిపారు.

గత సీజన్ మాదిరిగానే సాయం విడుదల : ఈ సీజన్ నుంచి ఎకరాకు రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.12 వేలు భరోసా కల్పిస్తున్నట్లు కొత్త ప్రభుత్వం ప్రకటించింది. గతంలో మాదిరిగానే తొలి రోజు ఎకరంలోపు, ఆ తర్వాత ఎంకరంన్నర, రెండెకరాలు ఇలా విడతల వారీగా 'ఈ కుబేర్' విధానం ద్వారా ఖాతాల్లో నగదు జమ అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

కొత్త రేషన్​ కార్డు కావాలంటే ఆ పత్రాలు కచ్చితంగా ఉండాల్సిందే - అయోమయంలో అర్జీదారులు

'జాబితాలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు లబ్ధిదారుల పేర్లు ఎందుకు లేవు' - గ్రామసభల్లో అధికారులకు ప్రశ్నలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.