LIVE : ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో చివరి ఘట్టం - పోటెత్తిన భక్తులు - MAHAKUMBH 2025 MAHASHIVRATRI LIVE
🎬 Watch Now: Feature Video


Published : Feb 26, 2025, 3:42 PM IST
Mahakumbh 2025 Mahashivratri Live : ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు తరలివస్తున్నారు. జనవరి 13వ తేదీన ఈ అధ్యాత్మిక వేడుక మొదలైంది. ఇవాళ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. హర హర మహదేవ్ నామస్మరణతో త్రివేణీ సంగమం ఘాట్లు మార్మోగుతూ ఆధ్యాత్మిక భావాన్ని సంతరించుకున్నాయి. ఇప్పటివరకు 64 కోట్ల మంది భక్తులు సందర్శించినట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ కుంభమేళాలో ఇవాళ చివరి అమృత్ స్నానం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అధికారులు కూడా భక్తులకు ప్రత్యేక సూచనలు చేశారు. కుంభమేళా అనంతరం భక్తులు తమ ప్రాంతాలకు తిరుగు ప్రయాణం అయ్యేలా ప్రయాగ్‌రాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు బుధవారం 350 రైళ్లను నడపనున్నట్లుగా రైల్వేశాఖ తెలిపింది. మహాశివరాత్రి సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.