LIVE : కరీంనగర్ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి - CM REVANTH ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video


Published : Feb 24, 2025, 7:08 PM IST
|Updated : Feb 24, 2025, 7:54 PM IST
CM Revanth Reddy MLC Election Campaign in Karimnagar Live : ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఒకే రోజున మూడు జిల్లాల్లో పర్యటించారు. ఉమ్మడి జిల్లాలకు చెందిన పట్టభద్రులు, కార్యకర్తలతో పీసీసీ ఈ సభలు ఏర్పాటు చేసింది. మంచిర్యాలలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం అనంతరం సీఎం రేవంత్ కరీంనగర్ చేరుకున్నారు. అక్కడ ప్రచార సభలో ప్రసంగిస్తున్నారు. బీఆర్‌స్, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలలో సీఎం, పీసీసీ అధ్యక్షులు, జిల్లాల మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రాజా నర్సింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.
Last Updated : Feb 24, 2025, 7:54 PM IST