Ind vs Pak Viewership : భారత్- పాకిస్థాన్ మ్యాచ్ తాజాగా ఓ రికార్డ్ సృష్టించింది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌ను జియోస్టార్ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంచింది. ఈ క్రమంలో ఇండో- పాక్ మ్యాచ్ క్రికెట్ హిస్టరీలోనే హైయ్యెస్ట్ వ్యూవర్షిప్ సాధించింది. ఈ మ్యాచ్‌కు జియోస్టార్‌లో ఏకంగా 60.2 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఒక క్రికెట్ మ్యాచ్‌కు ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్‌లో ఈ రేంజ్లో వ్యూస్ రావడం ఇదే తొలిసారి.
- ఒక్కో సమయంలో ఇలా
- మ్యాచ్ ప్రారంభమైన తర్వాత మహ్మద్ షమి తొలి ఓవర్ వేసినప్పుడు వ్యూవర్షిప్ సంఖ్య 6.8 కోట్లు
- పాకిస్థాన్ ఇన్నింగ్స్ ముగిసే సరికి 32.2 కోట్లు
- భారత్ ఇన్నింగ్స్ మధ్య వరకు 36.2 కోట్లు
- విరాట్ సెంచరీ చేసే సమయానికి 60.2 కోట్లు.
ఇలా మ్యాచ్ ప్రారంభమైనప్పుడు 6.8 కోట్లతో ఉన్న స్ట్రీమింగ్ వ్యూవర్షిప్ ఆఖర్లో విరాట్ శతకం చేసే సమయానికి ఏకంగా 60.2 కోట్లకు చేరుకుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మ్యాచ్‌పై ఉన్న హైప్తోపాటు విరాట్ సూపర్ ఇన్నింగ్స్ కూడా దీనికి ఒక కారణం.
No Indian Cricket fan will scroll down without liking this post.#ViratKohli𓃵 pic.twitter.com/7Q6JpBgERC
— Champions Trophy 2025 Commentary 🧢 (@IPL2025Auction) February 23, 2025
అదే కారణమా?
గతంలో జియో సినిమా, హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ క్రికెట్ మ్యాచ్‌లు స్ట్రీమింగ్ చేసేవి. అయితే విడివిడిగా ఉండడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉందని గ్రహించి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే ఈ రెండూ కలిసిపోయి 'జియోస్టార్'గా మారింది. ఈ రెండు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ వేర్వేరుగా ఉన్నప్పుడు గరిష్టంగా ఈ సంఖ్య 5 కోట్లు. హాట్‌స్టార్‌లో టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు 4 కోట్లకు పైగా రియల్ టైమ్ వ్యూస్ వచ్చాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే ఇదే అత్యధికం.
He did it for us! 💙#ChampionsTrophyOnJioStar #INDvsPAK #INDvPAK #ViratKohli𓃵 pic.twitter.com/JkFcSW2S7j
— JioHotstar (@JioHotstar) February 23, 2025
ఇప్పుడు రెండూ కలిసిపోవడం వల్లే అత్యధిక వ్యూస్ వచ్చాయని భావిస్తున్నారు. అలాగే భారత్‌తోపాటు బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవుల్లోనూ జియోహాట్‌స్టారే లైవ్ స్ట్రీమింగ్ ఇస్తోంది. ఇది కూడా ఈ రికార్డ్‌కు ఓ కారణంగా చెప్పవచ్చు.
కాగా, మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. విరాట్ కోహ్లీ (100) సూపర్ సెంచరీకి తోడు శ్రేయస్ అయ్యర్ (56 పరుగులు) హాఫ్ సెంచరీతో అదరదొట్టాడు. గిల్ (46 పరుగులు) రాణించాడు.
చరిత్ర సృష్టించిన విరాట్- వన్డేల్లో ఆల్‌టైమ్ రికార్డ్
ఎల్లో జెర్సీలో లైవ్ మ్యాచ్ చూస్తున్న ధోనీ- షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి మరీ!