Chhaava Director Apologize : బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ లీడ్ రోల్ లో తెరకెక్కిన 'ఛావా' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద వసూళ్లలో దూసుకెళ్తున్న ఈ సినిమా విషయంలో గానోజీ, కన్హోజీ షిర్కే వారసులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ వారికి క్షమాపణలు చెప్పారు.
దర్శకుడికి నోటీసులు
ఛావాలో తమ పూర్వీకులను తప్పుగా చూపించారంటూ గానోజీ, కన్హోజీ షిర్కే వారసులు ఇటీవల ఆరోపించారు. తమ పూర్వీకులకు సంబంధించిన సన్నివేశాల్లో తగిన మార్పులు చేయకపోతే ఊరుకోమని హెచ్చరించారు. న్యాయపోరాటానికి సిద్ధమని పేర్కొన్నారు. అంతేకాకుండా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఛావా దర్శకుడు లక్ష్మణ్‌కు నోటీసులు పంపించారు.
తగ్గిన దర్శకుడు
ఈ నోటీసులపై తాజాగా స్పందించారు లక్ష్మణ్ ఉటేకర్. గానోజీ, కన్హోజీ షిర్కే కుటుంబీకులకు ఫోన్ చేసి క్షమాపణలు తెలియజేశారు. గానోజీ, కన్హోజీలను తప్పుగా చూపించే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని చెప్పారు. అందుకే వారికి సంబంధించిన వివరాలు, వారు ఏ ప్రాంతానికి చెందినవారు అనే విషయాలను సినిమాలో తాను ఎక్కడా చూపించలేదని పేర్కొన్నారు. షిర్కే కుటుంబం మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని వెల్లడించారు. ఛావా సినిమాతో వారికి ఏదైనా అసౌకర్యాన్ని కలిగించినట్లయితే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని అన్నారు.
Some moments stay with you forever… the journey of #Chhaava has been one of them. 🙏
— Viineet Kumar Siingh (@vineetkumar_s) February 21, 2025
I visited the theatre, not knowing I was about to witness something truly special. People were in tears, holding my hands, sharing how deeply the film touched them. Seeing Chhaava connect with… pic.twitter.com/bWjitZ0w5F
ఇదీ కాంట్రవర్సీ
విక్కీ కౌశల్, రష్మిక మంధన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఛావా. ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా కనిపించారు. శంభాజీ మహరాజ్‌కు నమ్మకస్థులైన గానోజీ, కన్హోజీ చివరకు ఔరంగజేబుతో చేతులు కలిపి మహరాజ్ ప్రాణాలకు హాని వాటిల్లేలా చేశారని సినిమాలో చూపించారు. దీనిని వారి వారసులు ఖండించారు. ఈ క్రమంలో దర్శకుడు లక్ష్శణ్ ఉటేకర్ గానోజీ, కన్హోజీ వారసులకు క్షణాపణలు చెప్పారు.
రూ.300 కోట్లు వసూల్
ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. శంభాజీ మహరాజ్ పాత్రలో విక్కీ నటనను ప్రతిఒక్కరూ మెచ్చుకున్నారు. ప్రధాని మోదీ సైతం ఛావా సినిమా పై ప్రశంసలు కురిపించారు. రిలీజైన 10 రోజుల్లోనే ఈ సినిమా రూ.300 కోట్ల మార్కును అందుకుని సక్సెస్ ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది.
'ఛావా' టీమ్‌పై ప్రధాని ప్రశంసలు - విక్కీ కౌశల్ రియాక్షన్ ఏంటంటే?
'ఛావా' తెలుగు వెర్షన్‌కు హై డిమాండ్- మరి మేకర్స్ ఏం చేస్తారో ?