Virat Kohli Century : ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం నమోదు చేసింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో నెగ్గింది. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. కొంతకాలంగా తనపై వస్తున్న విమర్శలకు విరాట్ అద్భుత శతకంతో సమాధానమిచ్చాడు. విరాట్ మళ్లీ ఫామ్ అందుకోవడంతో అభిమానులు జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే తన సతీమణి, నటి అనుష్క శర్మ కూడా కింగ్ సెంచరీపై ఆనందం వ్యక్తం చేసింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫొటో షేర్ చేసింది.
ఇండో- పాక్ మ్యాచ్‌ను ఇంటి నుంచే వీక్షించిన అనుష్క, టీవీలో విరాట్ సెంచరీ సంబరాలను ఫొటో తీసి షేర్ చేసింది. దానికి 'లవ్', 'హైఫై' ఎమోజీలను జత చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఇక సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ తన మెడలోని గొలుసుకున్న వెడ్డింగ్ రింగ్‌ను ముద్దాడాడు. అనుష్కకు సందేశమిచ్చేలా కెమెరాకు విజయసంకేతం చూపించాడు. ప్రస్తుతం అనుష్క పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విరాట్‌పై పాక్ కెప్టెన్ ప్రశంసలు
ఈ మ్యాచ్‌లో విరాట్ అద్భుత ఇన్నింగ్స్‌ను పాకిస్థాన్ కెప్టెన్ రిజ్వాన్ ప్రశంసించాడు. తమ నుంచి కోహ్లీ మ్యాచ్ లాగేసుకున్నాడని అన్నాడు. 'విరాట్ హార్డ్ వర్క్ చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ మ్యాచ్ కోసం అతను చాలా కష్టపడి ఉంటాడు. చాలా ఈజీగా బంతిని బాదేశాడు. విరాట్‌ను ఔట్ చేయడానికి చాలా ప్రయత్నించాం. మేం అతడికి పరుగులు ఇవ్వొద్దనుకున్నాం'
'కానీ, సునాయసంగా పరుగులు చేస్తూ మా నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. కోహ్లీ ఫిట్‌నెస్ లెవల్, అతను కష్టపడిన తీరును కచ్చితంగా మెచ్చుకుంటాను. ఎందుకంటే అతను క్రికెటర్. మేమూ క్రికెటర్లమే. కోహ్లీ ఫామ్‌లో లేడని అందరూ అన్నారు. కానీ, పెద్ద మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడాడు' అని మ్యాచ్ అనంతరం రిజ్వాన్ పేర్కొన్నాడు.
52వ సెంచరీ
కాగా, ఈ మ్యాచ్‌లో విరాట్ 100 (116 బంతుల్లో) అదరగొట్టాడు. విరాట్‌కు వన్డేల్ల ఇది 52వ సెంచరీ కాగా, ఓవరాల్‌గా 82వ అంతర్జాతీయ శతకం. ఈ లిస్ట్‌లో విరాట్ కంటే ముందు సచిన్ తెందూల్కర్ (100 సెంచరీలు) ఒక్కడే ముందున్నాడు. ఈ మ్యాచ్‌లోనే విరాట్ మరో ఘనత సాధించాడు.
ఆల్‌టైమ్ రికార్డ్- క్రికెట్ హిస్టరీలోనే హైయ్యెస్ట్ వ్యూవర్షిప్- అంతా 'విరాట్' మాయే!
కోహ్లీ వేరే లెవెల్ సెంచరీ- పాకిస్థాన్ చిత్తు- దెబ్బకు దెబ్బ పడిందిగా