Hari Hara Veeramallu songs : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'హరి హర వీరమల్లు'. ఈ సినిమాను డైరెక్టర్లు క్రిష్, జ్యోతికృష్ణ పాన్ ఇండియా రేంజ్‌కో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఒక్కొక్క పాటను రిలీజ్ చేస్తున్నారు. గతనెల సినిమాలోంచి తొలి పాట విడుదల చేయగా, తాజాగా రెండో సాంగ్ రిలీజ్ చేశారు.
'కొల్లగొట్టినాదిరో' అంటూ సాగే ఈ పాటను గాయని మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్యా బెహరా, యామిని ఘంటశాల ఆలపించారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్ల్ అందించారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. ఈ పాటలో పవన్‌తో కలిసి అనసూయ, పూజిత పొన్నాడ డ్యాన్స్ చేశారు. ఇక ఈ పాట థియేటర్లో చూస్తుంటే విజిల్స్ పక్కా అని ఇటీవల నటి అనసూయ సందర్భంగాలో చెప్పారు.
'హరిహర వీరమల్లు' సినిమా విషయానికి వస్తే, చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో పవన్ కల్యాణ్ శక్తిమంతమైన యోధుడిగా కనువిందు చేయనున్నారు. రాబిన్ హుడ్ పాత్ర అని సినీ వర్గాల టాక్. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పాల్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే సినిమా ప్రమోషన్స్ కూడా ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది.
కాగా, పవన్ సరసన యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, బాబీ దేఓల్, నోరా ఫతేహి, విక్రమ్‌జీత్, జిషుసేన్ గుప్త్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది రెండు పార్టులుగా విడుదల కానుంది. ఈ క్రమంలో తొలి భాగమైన 'హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' 2025 మార్చి 28న సినిమా వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
'హరి హర వీరమల్లు' అప్డేట్- కొత్త పోస్టర్ రిలీజ్
డైరెక్టర్ విషయంలో ట్విస్ట్ - క్రిష్ స్థానంలో ఎవరంటే? - Harihara veeramallu Teaser