Health Benefits Of Fasting: మహా శివరాత్రి సందర్భంగా చాలా మంది పూజలతో పాటు ఉపవాసం ఉంటారు. దేవుడిపై భక్తితో కేవలం నీళ్లు, పండ్లు, జ్యూస్ తీసుకుంటూ ఉపవాసం చేస్తుంటారు. కొందరైతే వీటిని కూడా తీసుకోకుండా.. కొన్ని గంటల పాటు ఆహారం తినకుండా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? మీ శరీరంలో తలెత్తే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
గుండె ఆరోగ్యంగా : ఉపవాసం ఉండడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు. అలాగే మంచి కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటూ అప్పుడప్పుడూ ఉపవాసం ఉండటం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు.

షుగర్, బీపీ స్థాయులు అదుపులో: ఫాస్టింగ్ ఉండడం వల్ల మన శరీరంలో ఇన్సూలిన్ రెసిస్టెన్స్ తగ్గుతుందని చెబుతున్నారు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని, టైప్ 2 డయాబెటిస్ ముప్పు తగ్గుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

బ్రెయిన్ చురుకుగా పనిచేస్తుంది: మనం ఉపవాసం ఉన్నప్పుడు శరీరంలోని కొవ్వు శక్తిగా మారడం ప్రారంభమవుతుందని.. దీనిని 'కీటోసిస్' అంటారని చెబుతున్నారు. ఈ ప్రక్రియ వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఉపవాసం తర్వాత భోజనం చేసినప్పుడు, శరీరంలో శక్తి స్థాయులు పెరిగి.. మనల్ని మరింత చురుకుగా, అలర్ట్‌గా ఉంచడానికి సహాయపడుతుందని వివరిస్తున్నారు.
బరువు తగ్గుతారు: ఉపవాసం చేసేటప్పుడు మనం తినే ఆహారంతో పాటు శరీరానికి అందే క్యాలరీలూ తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. ఇంకా మన శరీరానికి అవసరమైన క్యాలరీల కంటే తక్కువ క్యాలరీలు తీసుకున్నప్పుడు, శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులు శక్తి కోసం ఖర్చవుతాయని వివరిస్తున్నారు. ఫలితంగా బరువు తగ్గడంతో పాటు జీవక్రియను మెరుగు పరుస్తుందని అంటున్నారు. 2018లో "Nutrition Reviews" జర్నల్లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. వివిధ రకాల ఉపవాస పద్ధతులు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయని పరిశోధకులు కనిపెట్టారు. ఇందులో కెనాడాలోని యార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ 'డాక్టర్ జాన్ డాన్సన్' పాల్గొన్నారు.

ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి: ఫాస్టింగ్ వల్ల డోపమైన, సెరోటోనిన్ అనే హార్మోన్ స్థాయులు కొంతవరకు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయని వివరిస్తున్నారు. ఇంకా కార్టిసాల్ అనే గ్రోత్ హార్మోన్ విడుదలను కొంత ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఉపవాసం వల్ల అనేక ప్రయోజనాలుప్పటికీ.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఫాస్టింగ్ చేసేముందు వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
"శివరాత్రి రోజున పూజ - ఈ పూలు శివుడికి నచ్చవు - వీటితో పూజిస్తే వివాహం అవుతుంది"