ETV Bharat / state

8 ఏళ్ల తర్వాత గర్భం - ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మ - WOMAN GAVE BIRTH TO THREE BABIES

ఒకే కాన్పులో ఇద్దరు మగబిడ్డలు, ఒక ఆడశిశువుకు జన్మనిచ్చిన మహిళ - గజ్వేల్​లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఘటన - శిశువులు ఆరోగ్యంగా ఉన్నారన్న ఆసుపత్రి సూపరింటెండెంట్

Woman Gave Birth to Three Babies
Woman Gave Birth to Three Babies (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2025, 9:32 PM IST

Woman Gave Birth To Three Babies : ఒకే కాన్పులో ముగ్గురు పండంటి బిడ్డలకు ఓ మహిళ జన్మనిచ్చిన అరుదైన ఘటన​ సంగారెడ్డి జిల్లాలోని గజ్వేల్​ పట్టణంలో ఉన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. తమకు వివాహమై ఎనిమిదేళ్లయినప్పటికీ సంతానం కలగకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైనప్పటికీ ఎట్టకేలకు ముగ్గురు పండంటి బిడ్డలు జన్మించడంతో ఆ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు శిశువులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.

ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపిన వివరాల ప్రకారం : సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని అడవి మసీదు గ్రామానికి చెందిన నాగరత్న - నర్సింహులుకు వివాహమై ఎనిమిదేళ్లు అవుతుంది. పెళ్లై ఇన్నేళ్లవుతున్నప్పటికీ సంతానం కలగకపోవడంతో ఆ దంపతులు ఇద్దరూ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అయితే ఐవీఎఫ్​ విధానం ద్వారా పిల్లలు కలుగుతారని తెలుసుకున్న నాగరత్న ఓ ఆసుపత్రిలో చికిత్స​ తీసుకున్నారు. అనంతరం గజ్వేల్​ పట్టణంలో ఉన్న జిల్లా ప్రభుత్వాసుపత్రికి ఆమె వచ్చి వైద్యసహాయం పొందారు. ఆ విధంగా క్రమంతప్పకుండా మూడో నెల నుంచే చెకప్​లు చేయించుకునేది.

ముగ్గురు పండంటి బిడ్డలకు జననం : ఎట్టకేలకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నాగరత్న ముగ్గురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది. వైద్యనిపుణులు ఆమెకు సీజేరియన్​ చేసి చికిత్సనందించారు. నాగరత్నకు ఇద్దరు మగబిడ్డలు, ఓ ఆడబిడ్డ పుట్టారని వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయన్నారు. ఇందులో భాగంగానే ముగ్గురు పిల్లలు జన్మించడం చాలా సంతోషమన్నారు.

"8 ఏళ్ల వివాహిత ఇన్​ఫెర్టిలిటీ ట్రీట్మెంట్​(ఐవీఎఫ్​) చేయించుకుని మా ఆసుపత్రికి వచ్చారు. మా వైద్యులను కలిశారు. మూడో నెల నుంచే ఇక్కడే రెగ్యులర్​ చెకప్​, స్కానింగ్​లు చేయించుకునేవారు. ఆమె గర్భంలో ముగ్గురు పిల్లలు ఉండటం వల్ల నార్మల్​ డెలివరీ అయ్యే అవకాశం తక్కువని, అందువల్ల సిజేరియన్​ చేయాల్సి ఉంటుందని ఆమెకు చెప్పాం. పేషెంట్​ అంగీకరించారు. దీంతో సిజేరియన్​ విధానంలో ఆపరేషన్​ చేశాం. 3 శిశువులు పుట్టారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు."- అన్నపూర్ణ, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ..

ఒకే కాన్పులో ఐదుగురు ఆడ శిశువుల జననం- సురక్షితంగా డెలివరీ- ఎక్కడో తెలుసా? - Woman Gives Birth To 5 Babies

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.