ETV Bharat / technology

M4 చిప్‌తో యాపిల్​ మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్స్- రిలీజ్ ఎప్పుడంటే? - APPLE MACBOOK AIR WITH M4 CHIP

లేటెస్ట్ చిప్​సెట్​తో యాపిల్ మ్యాక్​బుక్​ ఎయిర్- మార్చిలోనే రిలీజ్?​

Apple May Launch MacBook Air with M4 Chip in March
Apple May Launch MacBook Air with M4 Chip in March (Photo Credit- Apple)
author img

By ETV Bharat Tech Team

Published : Feb 24, 2025, 8:11 PM IST

Apple May Launch MacBook Air with M4 Chip: గత వారమే తన చౌకైన 'ఐఫోన్​ 16e'ను రిలీజ్​ చేసిన యాపిల్ తాజాగా మరో లాంఛ్​ కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తన 13-అంగుళాల, 15-అంగుళాల 'మ్యాక్​బుక్ ఎయిర్​'ను కొత్త M4 చిప్​తో అప్​డేట్​ చేయనుంది. ఈ మేరకు యాపిల్ 'మ్యాక్​బుక్ ఎయిర్'​ లైనప్​ను వచ్చే నెలలో కొత్త M4 చిప్‌లతో రిఫ్రెష్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంటే కంపెనీ మొత్తం మ్యాక్‌బుక్ ఫ్యామిలీని ఈ లెటెస్ట్ ప్రాసెసర్ జనరేషన్​లోకి తీసుకురాబోతుందన్నమాట.

బ్లూమ్‌బెర్గ్ మార్క్ గుర్మాన్ తన 'పవర్ ఆన్ న్యూస్​లెటర్' (Power On newsletter)లో యాపిల్ తన అప్​కమింగ్​ లాంఛ్​ కోసం రిటైల్​, మార్కెటింగ్ అండ్ సేల్స్ టీమ్స్​ను సిద్ధం చేయడం ప్రారంభించిందని రాసుకొచ్చారు. ఇందుకోసం కంపెనీ ప్రస్తుతం 'మ్యాక్‌బుక్ ఎయిర్' ఇన్వెంటరీ లెవల్స్​ను తగ్గించడానికి కూడా అనుమతిస్తోందని తెలిపారు. ఇన్వెంటరీ లెవల్స్ అంటే ఒక వ్యాపారం తన పంపిణీ నెట్‌వర్క్‌లో ఉంచుకున్న స్టాక్ మొత్తం అని అర్థం. కంపెనీ ఇప్పుడు తన ప్రస్తుత 'మ్యాక్​బుక్ ఎయిర్'​ ఇన్వెంటరీ లెవల్స్​ను తగ్గించడం అనేది తన ఇమ్మినెంట్ ప్రొడక్ట్ అప్​డేట్​కు ఒక సాధారణ సంకేతం.

అయితే ఈ లాంఛ్​ డేట్​పై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. కానీ ఈ నివేదిక నిజమైతే మార్చికి కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉన్నందున దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త మ్యాక్‌బుక్‌ల షిప్‌మెంట్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని గతవారం నుంచే కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అంటే వీటి లాంఛ్ ఇంకా త్వరగానే ఉండొచ్చని కూడా ఈ నివేదికలు సూచిస్తున్నాయి.

మ్యాక్‌బుక్ ఎయిర్ కొత్త అప్‌గ్రేడ్స్​ ఇవే!: ఈ కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ కనీస అప్‌గ్రేడ్‌లతో వస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త యాపిల్ ల్యాప్‌టాప్ M4 చిప్​తో బేస్ వేరియంట్‌లో 16GB RAMతో వస్తుంది. USB 4 లేదా Thunderbolt 3కి బదులుగా Thunderbolt 4 పోర్ట్ అదనపు సపోర్ట్​తో సహా డివైజ్ పొటెన్షియల్ ఇంప్రూవ్మెంట్స్​పై కూడా నివేదికలు ఉన్నాయి. అంతేకాక సెంటర్ స్టేజ్ కెమెరా ఫీచర్​ కూడా ఈ కొత్త మ్యాక్​బుక్​ ఎయిర్​లో వస్తుందని తెలుస్తోంది. దీంతోపాటు ఆప్షనల్ నానో-టెక్చర్ డిస్​ప్లే కూడా ఇందులో ఉండొచ్చు. ఈ ఫీచర్​ను ఇప్పటికే ఇతర M4-బేస్డ్ మ్యాక్​లలో తీసుకొచ్చారు.

బిజీ బిజీగా యాపిల్: రాబోయే కొన్ని నెలలు యాపిల్ ఫుల్ బిజీగా ఉండనున్నట్లు సమాచారం. కొత్త 'మ్యాక్​బుక్​ ఎయిర్​' లాంఛ్ వచ్చే నెలలో ఉండొచ్చని పుకార్లు షికార్లు చేస్తుండగా.. ఆ తర్వాత మే నెలలో 'iOS 18.4' రిలీజ్ ఉంటుందని సమాచారం. ఇక ఈ ఏడాది యాపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC 2025) జూన్ నెలలో ఉంటుందని అంచనా. ఈ WWDC అనేది కొత్త సాఫ్ట్‌వేర్, సాంకేతికతలను ప్రదర్శించే యాపిల్ వార్షిక ఈవెంట్. దీంతో యాపిల్ హెడ్​క్వార్టర్స్​ కొంతకాలం బిజీ బిజీగా గడపబోతున్నట్లు తెలుస్తోంది.

దీనికి తోడు ఈ సంవత్సరం యాపిల్ తన పరికరాల సమూహాన్ని అప్‌గ్రేడ్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. వీటిలో 'M4 Mac Studio', 'M4 Mac Pro' ఉన్నాయి. ఇవి రెండూ ఈ వేసవిలో లాంఛ్​ కానున్నట్లు సమాచారం. ఇవికాకుండా యాపిల్ M5 చిప్ అక్టోబర్-నవంబర్ మధ్య వస్తుందని, మొదట ఇది 'మ్యాక్‌బుక్ ప్రో'లో ప్రవేశిస్తుందని కూడా నివేదికలు ఉన్నాయి. అయితే M5-బేస్డ్ ఐప్యాడ్ ప్రో 2026 ప్రారంభం వరకు లాంఛ్​ చేసే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

మంచి స్మార్ట్​ఫోన్ కొనాలా?- అయితే కాస్త ఆగండి- త్వరలో కిర్రాక్ మోడల్స్​ లాంఛ్!

MyJio యాప్- రీఛార్జ్​లకు మాత్రమే కాదు, కరెంట్ బిల్లు పేమెంట్స్​కు కూడా!- ఎలాగంటే?

'మేం వదిలేశాం, వాళ్లు పట్టుకున్నారు'- మైక్రోసాఫ్ట్ చేసిన అతిపెద్ద తప్పు ఇదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.