ETV Bharat / entertainment

న్యూస్‌ చదవకపోతే కష్టమే! ఫ్లైట్‌లో బ్యాంకాక్​కు న్యూస్‌ పేపర్స్ తెప్పించిన ఇండియన్​ హీరో - AMITABH BACHCHAN UNIQUE HABITS

ముంబయి నుంచి బ్యాంకాక్‌కు వెళ్లిన పేపర్లు- ఏ సినిమా షూటింగ్‌ అంటే?

Amitabh Bachchan Unique Habits
Amitabh Bachchan Unique Habits (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2025, 8:02 PM IST

Updated : Feb 24, 2025, 8:07 PM IST

Amitabh Bachchan Unique Habits : సాధారణంగా మూవీ స్టార్‌లు లగ్జరీ లైఫ్‌స్టైల్‌ గడుపుతారు. వారి అలవాట్లు, అవసరాలకు ఎలాంటి కొదవ రానీయరు. ముఖ్యంగా కొందరు షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోకస్‌ చేయడంలో సహాయపడటానికి లొకేషన్‌లో కొన్ని ప్రత్యేక దినచర్యలు (పర్సనల్‌ రొటీన్స్‌) ఫాలో అవుతుంటారు. అలాంటి వారిలో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఉన్నారు. ఆయన అలవాటు గురించి తెలిస్తే షాక్‌ అవుతారు!

2005లో బ్యాంకాక్‌లో 'ఏక్ అజ్నాబీ' (Ek Ajnabee) సినిమా షూటింగ్ జరిగింది. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్ కోసం రోజూ ముంబయి నుంచి న్యూస్‌ పేపర్‌లు వచ్చేవి. అతడికి ప్రతి రోజూ న్యూస్‌ పేపర్‌ చదివే అలవాటు. బచ్చన్‌ వాటిని చదివిన తర్వాత సాయంత్రం ఫ్లైట్‌లో తిరిగి ముంబయికి పంపేవారు. ఓ నివేదిక ప్రకారం ఫ్రైడే టాకీస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ మూవీ నిర్మాత అపూర్వ లఖియా ఈ వివరాలు షేర్‌ చేసుకున్నారు.

లఖియా మాట్లాడుతూ, 'అప్పట్లో ముంబయి నుంచి బ్యాంకాక్‌కి మార్నింగ్‌ ఫ్లైట్‌ ఉండేది. అది సాయంత్రం మళ్లీ తిరిగి ముంబయికి వచ్చేది. అమితాబ్‌ సెక్రటరీ రోజీ అన్ని న్యూస్‌ పేపర్‌లు సేకరించి, వాటిని ఫ్లైట్‌లో పంపించేవారు. బ్యాంకాక్‌లో ఎవరైనా అమిత్ జీకి అందజేసేవారు. వాటిని అమితాబ్‌ చదివి మార్కింగ్ చేసేవారు. వాటికి సంబంధించి పర్సనల్‌ మెసేజ్‌లు కూడా రాసేవారు. ఆ తర్వాత పేపర్లు ఈవెనింగ్‌ ఫ్లైట్‌లో తిరిగి ముంబయికి చేరేవి' అని తెలిపారు.

Bollywood megastar Amitabh Bachchan
అమితాబ్ బచ్చన్ (IANS)

బ్యాంకాక్‌లో ఫన్నీ మూమెంట్
లఖియా బ్యాంకాక్‌లో షూటింగ్‌ జరుగుతున్నప్పటి సరదా సంఘటనలు కూడా పంచుకున్నారు. 'బచ్చన్ పాపులర్‌ పాట్‌పాంగ్‌, లైవ్‌ షోకి వెళ్లాలనుకున్నారు. అక్కడ భారత అభిమానులు చూస్తే అల్లర్లు జరుగుతాయి, సమస్య అవుతుందని చెప్పాను. కానీ బచ్చన్ పట్టుబట్టడం వల్ల తప్పక వెళ్లాం. అమిత్ జీ అలాంటి షో ఎప్పుడూ చూడలేదు. దాదాపు పూర్తిగా విప్పేసినట్లు ఉండే చొక్కా, సాంప్రదాయ థాయ్ ధోతీ లాంటి దుస్తులను ధరించారు. ఆ ప్రాంతంలోని భారతీయులు అమితాబ్‌ను చూసి పిచ్చెక్కిపోయారు. అమితాబ్‌ జుహూ(ముంబయిలో సెలబ్రిటీలో ఉండే ప్రాంతం)లో ఉన్నట్లుగా తిరిగారు' అని తెలిపారు.

ఏక్ అజ్నాబీ హిట్‌ అయిందా?
'ఏక్ అజ్నాబీ' మూవీ 'మ్యాన్ ఆన్ ఫైర్'కి రీమేక్. ఇందులో డెంజెల్ వాషింగ్టన్, క్రిస్టోఫర్ వాకెన్, డకోటా ఫానింగ్ నటించారు. హిందీ వెర్షన్‌లో అర్జున్ రాంపాల్, అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, లారా దత్తా యాక్ట్‌ చేశారు. స్టార్‌లకు కొదవలేకపోయినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ తొలిసారి విలన్‌గా నటించినా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. బిగ్ బి చివరిసారిగా తమిళ సినిమా 'వెట్టయన్‌'లో కనిపించారు. 2024లో రిలీజ్ అయిన మూవీ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అమితాబ్‌ 'రామాయణం: పార్ట్ 1'లో నటిస్తున్నారు. 2026లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

Last Updated : Feb 24, 2025, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.