ETV Bharat / sports

బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్‌ విజయం- సెమీస్‌కు భారత్​ - CHAMPIONS TROPHY 2025

బంగ్లాదేశ్‌పై న్యూజిలాండ్‌ విజయం- సెమీస్‌ బెర్త్‌ ఖరారు

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2025, 10:25 PM IST

Champions Trophy 2025 Semi Finals : ఛాంపియన్స్‌ ట్రోఫీలో న్యూజిలాండ్‌ సెమీస్‌ దిశగా దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని 46.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రచిన్‌ రవీంద్ర 112 (105) సెంచరీతో ఆకట్టుకున్నాడు. లేథమ్‌ 55(76) పరుగులు సాధించి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఫిలిప్స్‌ 21 (28), బ్రేస్‌వెల్‌ 11 (13) నాటౌట్‌గా నిలిచారు. కాన్వే 30(45), విలియమ్సన్‌ 5(4) పరుగులు చేయగా, విల్‌ యంగ్‌ డకౌట్‌ అయ్యాడు. బంగ్లా బౌలర్లలో టస్కిన్‌ అహ్మద్‌, నహీద్‌ రాణా, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, రిషాద్‌ హొస్సేన్‌లు ఒక్కో వికెట్‌ తీశారు. న్యూజిలాండ్‌ విజయంతో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లు సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. దీంతో గ్రూపు - ఏ నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు సెమీస్‌కు చేరాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.