ETV Bharat / health

మీ ఇంట్లోని ఈ ఒక్క ఆకు - అల్సర్​, షుగర్​కు అద్భుత మెడిసిన్! - ఇన్నాళ్లూ తెలియలేదు! - GUAVA FRUIT FOR DIABETIC

- గుండె సమస్యలు, మలబద్ధకాన్నీ నివారిస్తుందంటున్న నిపుణులు

GUAVA FRUIT FOR DIABETIC
GUAVA JUICE FOR SUGAR PATIENTS (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2025, 6:33 PM IST

GUAVA JUICE FOR SUGAR PATIENTS : నేచర్​ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన చుట్టూ ఉండే ఎన్నో చెట్లు పండ్లు, పువ్వులు, ఆకుల రూపంలో ఆరోగ్యాన్ని అందిస్తుంటాయి. అలాంటి ఒక చెట్టు ఆకు గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అదే జామ ఆకు. ఎంతో మంది ఇళ్లలోనో, ఇంటి ముందో ఈ జామ చెట్టు ఉంటుంది. జామ కాయలు ఎంతటి ఆరోగ్యాన్ని అందిస్తాయో, వాటి ఆకులు కూడా అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • మలబద్ధకంతో బాధపడే వారికి జామ ఆకుల కషాయం ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తరచూ తీసుకోవడం ద్వారా విరేచనం సాఫీగా అవుతుందంటున్నారు.
  • జ్వరంతో బాధపడుతున్నప్పుడు కూడా జామ ఆకులను నీటిలో మరిగించి తాగితే ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
  • చాలా మంది అల్సర్​తో అవస్థలు పడుతుంటారు. దీర్ఘకాలంగా ఏళ్ల తరబడి ఈ సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారికి జామ ఆకు రసం ఎంతో బాగా ఉపయోపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
  • జామ ఆకులను రాత్రి గ్లాసు నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని కాచి, వడకట్టి పరగడుపున తాగితే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నీరు తాగడం ద్వారా కడుపులో యాసిడ్స్​ ద్వారా జరిగే నష్టం తగ్గుతుందని, ఈ వాటర్ కంటిన్యూగా తీసుకుంటూ, సులువుగా జీర్ణమయ్యే ఆహారం తినడం ద్వారా గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యను త్వరగా తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
  • ఇంకా అజీర్తి సమస్యను కూడా జామ ఆకు రసం నివారిస్తుందని చెబుతున్నారు. ఇందులో ఫైబర్ ఉంటుందని, ఇంకా ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడతాయని అంటున్నారు. అందువల్ల అజీర్ణ సమస్యలు ఉంటే జామ ఆకులను మరిగించి, ఆ నీటిని తాగాలని సూచిస్తున్నారు.
  • జామ కాయలో విటమిన్ సి ఎంతగా ఉంటుందో మనకు తెలిసిందే. ఇదేవిధంగా జామ ఆకులోనూ ఉంటుందని చెబుతున్నారు. ఈ ఆకు రసం తరచూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు.
  • విటమిన్ C తోపాటు, యాంటీ ఆక్సిడెంట్స్​ పుష్కలంగా శరీరానికి అందడంవల్ల చర్మం కూడా కాంతివంతంగా మెరుస్తుందని, జుట్టు కూడా బలంగా తయారవుతుందని అంటున్నారు.
  • షుగర్​ లెవల్స్​ తగ్గించడంలోనూ జామ ఆకు రసం చక్కగా పనిచేస్తుందట. శరీరంలో ఏర్పడిన ఇన్సులిన్ సమస్యను నివారించడం ద్వారా గ్లూకోజ్ శోషణను తగ్గిస్తుందని, తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చూస్తుందని చెబుతున్నారు. ఈ మేరకు ఎలుకల్లో చేసిన పరిశోధన వివరాలను సైన్స్ డైరెక్ట్​ అనే జర్నల్ ప్రచురించింది.
  • గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ జామ ఆకు రసం చక్కగా పనిచేస్తుందని, శరీరంలో బ్యాడ్​ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయ పడుతుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

వారానికి కనీసంగా పెరుగు తింటే - పెద్ద పేగు క్యాన్సర్​ ముప్పు అడ్డుకోవచ్చట! - కీలక పరిశోధన

తెలుపు, గులాబీ రంగు జామ- ఇందులో ఏది ఆరోగ్యానికి మంచిది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.