ETV Bharat / technology

MyJio యాప్- రీఛార్జ్​లకు మాత్రమే కాదు, కరెంట్ బిల్లు పేమెంట్స్​కు కూడా!- ఎలాగంటే? - ELECTRICITY BILL MYJIO APP

కరెంట్​ బిల్లు కట్టాలా?- అయితే 'మైజియో' యాప్ ట్రై చేయండి- సింపుల్​గా అయిపోతుంది!

MyJio makes it easy: How to pay your electricity bill in a few taps
MyJio makes it easy: How to pay your electricity bill in a few taps (Photo Credit- ETV Bharat Via MyJio App)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2025, 3:39 PM IST

Electricity Bill MyJio App: జియో భారతదేశంలోని అతిపెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటి. ఈ కంపెనీ అన్​లిమిటెడ్ వాయిస్ కాల్స్, హై-స్పీడ్ డేటాతో పాటు వివిధ జియో యాప్​లకు యాక్సెస్​ను అందించే సరసమైన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్​లకు ప్రసిద్ధి చెందింది. ఇక మీ జియో మొబైల్ నంబర్​కు రీఛార్జ్ చేసుకునేందుకు ఫాస్టెస్ట్ ప్లాట్​ఫామ్ ఏదంటే 'MyJio' యాప్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

అయితే ఈ యాప్ ద్వారా మీరు యుటిలిటీ బిల్లులు కూడా చెల్లించొచ్చని మీకు తెలుసా? మీరు మీ విద్యుత్ బిల్లు చెల్లించేందుకు ఇప్పటికీ ఎలక్ట్రిసిటీ ఆఫీస్​కు వెళ్తున్నారా? అయితే ఇకపై అలా చేయాల్సిన అవసరం లేదు. మీరు కేవలం కొన్ని క్లిక్‌లతోనే ఇంట్లో కూర్చొని మీ విద్యుత్ బిల్లులను 'MyJio' యాప్​ ద్వారా సులభంగా చెల్లించొచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి.

MyJio యాప్‌లో విద్యుత్ బిల్లులు చెల్లించడం ఎలా?:

  • ముందుగా యాపిల్ యాప్ స్టోర్ లేదా గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి 'MyJio' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయండి.
  • తర్వాత మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్​ చేసి లాగిన్ అవ్వండి.
  • ఇది పూర్తయిన తర్వాత, మీ స్కీన్​ను కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే దిగువన 'Finance' సెక్షన్​ కన్పిస్తుంది. దానిలో 'Bills'పై ట్యాప్ చేయండి.
  • ఇప్పుడు అందులో కన్పిస్తున్న 'Electricity' ఆప్షన్​ను సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు అది మీ సపోర్టెడ్ విద్యుత్ ఆపరేటర్ల లిస్ట్​ను చూపిస్తుంది.
  • అక్కడ కన్పిస్తున్న మీ విద్యుత్ ఆపరేటర్‌ పేరును సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇది తెలియకపోతే, మీ కరెంటు బిల్లులో ఉన్న పేరును చెక్​ చేసుకుని సెలక్ట్ చేసుకోవచ్చు.
  • ఆ తర్వాత కస్టమర్ IDని ఎంటర్​ చేసి, 'Proceed' బటన్​పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు విద్యుత్ బిల్లు అమౌంట్​ను ఎంటర్​ చేసి, పేమెంట్​ కోసం మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా UPI నుంచి ఏదైనా ఆప్షన్​ను ఎంచుకోవచ్చు. తద్వారా అవసరమైన వివరాలను ఎంటర్​ చేసి పేమెంట్​ పూర్తి చేయొచ్చు.

అంతే ఇలా సింపుల్​గా మీ MyJio యాప్‌లో విద్యుత్ బిల్లులను హాయిగా ఇంట్లోనే కూర్చునే చెల్లించొచ్చు.

JioMoney యాప్ ఇకపై అందుబాటులో ఉండదు: మీరు ఆన్​లైన్​లో బిల్లుల చెల్లింపు కోసం 'JioMoney' యాప్ గురించి ఆలోచిస్తుంటే.. రిలయన్స్ జియో ఈ యాప్​ను యాపిల్, గూగుల్ స్టోర్​ల నుంచి తొలగించిందని గమనించాలి. అయితే ఈ 'JioMoney' యాప్‌లోని అదే ఫీచర్ ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉంది. కానీ మీరు జియో యూజర్ అయితే 'MyJio' యాప్​ సహాయంతో బిల్లులు చెల్లించొచ్చు. ఇది ఆన్‌లైన్ బిల్ పేమెంట్స్​ను గతంలో కంటే చాలా సులభతరం, సౌకర్యవంతంగా చేస్తుంది.

'మేం వదిలేశాం, వాళ్లు పట్టుకున్నారు'- మైక్రోసాఫ్ట్ చేసిన అతిపెద్ద తప్పు ఇదే!

ఓపెన్​ఏఐ నుంచి 'ఏఐ ఏజెంట్​'- దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

యాపిల్ లవర్స్​కు క్రేజీ అప్డేట్​- ఆండ్రాయిడ్ ఫోన్​లకు ధీటుగా ఫోల్డబుల్ ఐఫోన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.