LIVE : ప్రజాభవన్‌లో బీసీ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం ప్రత్యక్ష ప్రసారం - CM REVANTH LIVE
🎬 Watch Now: Feature Video


Published : Feb 22, 2025, 2:11 PM IST
|Updated : Feb 22, 2025, 3:07 PM IST
CM Revanth Reddy On Caste Census LIVE : బీసీ కులగణనపై ప్రతిపక్షాల నుంచి పలు రకాల సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటి నివృత్తికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రజాభవన్‌లో బీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బీసీ కులగణన,42 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్‌కు సంబంధించిన సందేహాలపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరిస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. బీసీ కులగణనపై సందేహాల నివృత్తికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్కలు ప్రజాభవన్‌లో బీసీ నేతలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతున్నారు. బీసీ కులగణన, 42శాతం రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
Last Updated : Feb 22, 2025, 3:07 PM IST