LIVE : హైదరాబాద్ హైటెక్స్‌లో బయో ఆసియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి - BIO ASIA CONFERENCE LIVE
🎬 Watch Now: Feature Video


Published : Feb 25, 2025, 10:57 AM IST
|Updated : Feb 25, 2025, 11:31 AM IST
Bio Asia Conference Live : ఇవాళ హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో బయో ఆసియా సదస్సు ప్రారంభమైంది. ఉదయం 1 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సదస్సు ప్రారంభించారు. ఈ సదస్సులో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ బయో ఆసియా సదస్సులో ఫార్మా, లైఫ్‌సైన్సెస్, బయోటెక్ కంపెనీల సీఈవోలు, ఛైర్మన్‌లు పాల్గొన్నారు. ఏఐ ఆధారిత లైఫ్ సైన్సెస్, క్లినికల్ ట్రయిల్స్‌పై సదస్సులో చర్చిస్తున్నారు. అలాగే సులభతర పరిశోధనలు, ఉత్పత్తుల తయారీపై సదస్సులో చర్చిస్తున్నారు. వినూత్న ఆలోచనలు, విధివిధానాల మార్పిడి, అంకుర పరిశ్రమలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బయో ఆసియా సదస్సు రెండోసారి జరుగుతోంది. అప్పుడు 21వ బయో ఆసియా సదస్సులో జీవ వైద్య సాంకేతిక రంగంలో మార్పులు, ఆవిష్కరణలపై చర్చ జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఏఐ ఆధారిత అంశాలపైనే సదస్సులో చర్చ జరుగుతోంది. బంగారు భవిష్యత్తు సాధించేందుకు ఈ బయో ఆసియా సదస్సు ఉపయోగపడుతోందని సీఎం రేవంత్ అన్నారు.
Last Updated : Feb 25, 2025, 11:31 AM IST