The Return Of Dragon Heroine Kayadu Lohar : ఇండస్ట్రీతో సంబంధం లేకుండా కొంత మంది హీరోహీరోయిన్లు వెండితెరపై తమ ట్యాలెంట్‌తో దూసుకెళ్తుంటారు. చేసింది చిన్న పాత్ర అయినా సరే తమ నటనతో పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అవుతుంటారు. తాజాగా ఈ కోవలోకి వచ్చేసింది నటి కాయదు లోహర్. తాజాగా 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్'సినిమాతో కుర్రకారుకు కొత్త క్రష్‌గా మారింది ఈ చిన్నది. ఈ చిత్రంలో తన నటనకు ఫిదా అయిన యూత్ తన గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు. మరీ ఆ అమ్మడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా?
డ్రాగన్ కంటే ముందు తెలుగులో!
ఇప్పుడైతే ఈ చిన్నది 'ది రిటర్న్ ఆఫ్ డ్రాగన్'తో పాపులర్ అయినప్పటికీ ఇదివరకే ఆమె తెలుగులో ఓ సినిమాలో నటించింది. శ్రీ విష్ణు లీడ్ రోల్లో తెరకెక్కిన 'అల్లూరి'లో నటించింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోకపోవడం వల్ల కాయదుకి ఇక్కడ బ్రేక్ దక్కలేదు. ఆ తర్వాత తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీలోనూ చిత్రాలు చేసింది. అవేవీ తనకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. అయితే తాజాగా వచ్చిన 'డ్రాగన్' తనను అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో ఓవర్‌నైట్ స్టార్‌ను చేసింది. అంతేకాకుండా తనకు నెట్టింట మంచి ఫాలోయింగ్‌తో పాటు క్రేజ్ కూడా పెరిగిపోయింది.
ప్రమోషనల్ ఈవెంట్స్‌లో సందడి
ఇదిలా ఉండగా, లేటెస్ట్గా ఈ చిన్నది 'డ్రాగన్' ప్రమోషనల్ ఈవెంట్స్‌లోనూ తనదైన స్టైల్లో ఆకట్టుకుని సందడి చేసింది. ముఖ్యంగా మీమ్స్ గురించి తన ఫోన్లోని ఓ యాప్ గురించి మాట్లాడి నెట్టింట తెగ వైరల్ అయిపోయింది. తన క్యూట్‌నెస్‌తో కుర్రాళ్లను ఫిదా చేసింది. ప్రతి ఈవెంట్లోనూ అల్లరి చేస్తూ ఆకట్టుకుంది.
అప్‌కమింగ్ మూవీస్ ఇవే :
ప్రస్తుతం 'డ్రాగన్' సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న కాయదు, దీని తర్వాత తమిళంలో 'ఇదయం మురళి' అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలవ్వగా, దానికి సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. ఆమె రోల్ కూడా ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తోంది.తెలుగులో లక్కీ ఛాన్స్!
Kayadu Lohar BUSTED 🤯🤯
— OTTention (@OTTentiondotcom) February 23, 2025
She Is Creating Memes On Her Own It Seems 😂😂#Dragon #kayaduloharpic.twitter.com/zyIi9mP2J2