How to Make Egg Nilva Pachadi: నిల్వ పచ్చళ్లు అనగానే చాలా మందికి మామిడికాయ, గోంగూర, టమటా, దోసకాయ అంటూ రకరకాల కూరగాయలతో పెట్టినవి మాత్రమే గుర్తుకువస్తాయి. కానీ ఎన్నో రకాల పదార్థాలతో నిల్వ పచ్చళ్లు పెట్టుకోవచ్చు. అందులో కోడిగుడ్డు పచ్చడి కూడా ఒకటి. ఎగ్స్‌తో ఆమ్లెట్, ఫ్రై, పులుసు మాత్రమే మాకు తెలుసంటారా? వాటితో పాటు ఇలా పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. ఇది చూడటానికి చికెన్ పచ్చడిలా అనిపిస్తుంది. ఇక టేస్ట్ గురించి అయితే చెప్పక్కర్లేదు. చాలా బాగుంటుంది. అన్నం, చపాతీలో పర్ఫెక్ట్. పైగా చాలా తక్కువ సమయంలో ఈ పచ్చడిని పెట్టుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- కోడి గుడ్లు - 4
- ఉప్పు - పావు టీ స్పూన్
- మిరియాల పొడి - పావు టీ స్పూన్
- ఆయిల్ - 1 స్పూన్
పచ్చడి కోసం:
- నూనె - 1 కప్పు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు
- పసుపు - పావు టీ స్పూన్
- ధనియాల పొడి - 1 టీ స్పూన్
- గరం మసాలా - 1 టీ స్పూన్
- కారం - 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- నిమ్మరసం - 2 స్పూన్లు
తయారీ విధానం:
- ఓ బౌల్లోకి కోడి గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత నూనె వేసి మరోసారి కలిపి ఈ ఎగ్ మిశ్రమాన్ని ఓ బాక్స్‌లోకి తీసుకుని మూత పెట్టాలి.
- ప్రెషర్ కుక్కర్ ఓ గ్లాస్ నీళ్లు పోసి ఓ స్టాండ్ పెట్టాలి. ఆ స్టాండ్ మీద ఎగ్ మిశ్రమం ఉన్న బాక్స్ ఉంచి కుక్కర్ మూత పెట్టి విజిల్ ఉంచాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ ప్రెషర్ కుక్కర్ పెట్టి హై ఫ్లేమ్ మీద ఓ విజిల్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి.
- కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి బాక్స్‌ను బయట పెట్టాలి. లోపల ఎగ్ మిశ్రమం చల్లారిన తర్వాత క్యూబ్స్‌గా కట్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఉడికించిన కోడిగుడ్ల క్యూబ్స్ వేసుకుని లైట్‌గా కలర్ మారేవరకు వేయించుకోవాలి.
- ఇలా వేగిన కోడిగుడ్ల ముక్కలను ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడే అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించుకోవాలి.
- అల్లం పేస్ట్ మగ్గిన తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి మసాలాలు మాడకుండా కుక్ చేసుకోవాలి.
- మసాలాలు మగ్గి నూనె పైకి తేలిన తర్వాత వేయించిన కోడిగుడ్డు ముక్కలు వేసి బాగా కలపాలి.
- చివరగా నిమ్మరసం పిండి మరోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత గాజు జార్‌లోకి తీసుకుని వీలైతే ఓ రోజంతా లేదా ఓ 5 గంటలు కదపకుండా ఉంచాలి. అంతే సూపర్ టేస్టీ కోడిగుడ్డు నిల్వ పచ్చడి రెడీ.
- వేడి వేడి అన్నంలోకి కొద్దిగా వేసుకుని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది.
10 నిమిషాల్లో "టమాటా పచ్చడి" - రుబ్బడం, తాలింపు అవసరమే లేదు - టేస్ట్ అదుర్స్!
"మెంతికూర - టమాటా పచ్చడి" చేయాల్సిన పద్ధతి ఇదీ! - సువాసనకే మౌత్ వాటరింగ్ అయిపోద్ది!