MAD Square Teaser : 'మ్యాడ్' సినిమాతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ఈ సారి దాన్ని డబుల్ డోస్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 2023లో విడుదలైన ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు 'మ్యాడ్ స్క్వేర్'గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ నెట్టింట ట్రెండ్ అవ్వగా, తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
అందులో లడ్డూ పెళ్లికి డైరెక్టర్ వెంకీ అట్లూరి, అనుదీప్ కేవీ, నిర్మాత నాగవంశీలు చదివింపులు ఇచ్చినట్లు టీజర్ ప్రారంభమైంది. ఇక అక్కడి నుంచి ఆద్యంతం నవ్వులు పూయించేలా సాగింది ఆ గ్లింప్స్. చూస్తుంటే 'మ్యాడ్'కి మించిన ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సీక్వెల్లో ఉండనున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది.
ఇక నార్నే నితిన్ నటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిత్రం 'మ్యాడ్'. ఇందులో నితిన్‌తో పాటు సంతోష్ శోభన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక సునీల్‌కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, అనుదీప్, మురళీధర్ గౌడ్, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. హీరోతో పాటు ఇందులోని నటీనటులందరూ తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ సీక్వెల్‌తో మరింత ఎంటర్టైన్ చేసేందుకు ముందుకు రానున్నారు. మార్చి 29న ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
మ్యాడ్ స్టోరీ ఏంటంటే ?
మనోజ్(రామ్ నితిన్), అశోక్ (నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకుంటుంటారు. భగవాన్ క్యాంటిన్ విషయంలో జరిగిన ఓ బాస్కెట్ బాల్ పోటీలో విజేతగా నిలిచి మంచి స్నేహితులవుతారు. మనోజ్ శృతి(గౌరి)ని ప్రేమిస్తుంటాడు.
జెన్నీ(అనంతిక) అశోక్ ఇష్టపడుతుంటుంది. దామోదర్ అలియాస్ డీడీకి గుర్తుతెలియని వెన్నెల అనే అమ్మాయి లవ్ లెటర్ రాసి తనను ప్రేమలో పడేలా చేస్తుంది. హాస్టల్‌కు ఫోన్ చేసి రోజూ డీడీతో ప్రేమగా మాట్లాడుతుంటుంది. వెన్నెలను చూడకుండానే డీడీ నాలుగేళ్లు గడిపేస్తాడు. చివరకు వెన్నెలను వెతికే క్రమంలో డీడీకి తెలిసిన నిజం ఏంటీ? మధ్యలో లడ్డు(విష్ణు) కథేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఓటీటీల్లో బెస్ట్ కామెడీ మూవీస్- చూస్తున్నంతసేపు నవ్వులే నవ్వులు! - Top Comedy Movies In Tollywood