ETV Bharat / technology

మీ ఫోన్​లో డ్యూయల్ సిమ్ ఉందా?- కేవలం రూ.59కే రెండో సిమ్ యాక్టివ్​గా​! - JIO VS AIRTEL VS VI VS BSNL

Jio vs Airtel vs Vi vs BSNL- రెండో సిమ్ యాక్టివ్​గా ఉంచేందుకు బెస్ట్ ఆప్షన్​ ఇదే!

A breakdown of the most affordable recharge plans in 2025
A breakdown of the most affordable recharge plans in 2025 (Photo Credit- ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Feb 25, 2025, 7:39 PM IST

Jio vs Airtel vs Vi vs BSNL: టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi), BSNL ఇటీవల తమ రీఛార్జ్ ప్లాన్‌లను అప్‌డేట్ చేశాయి. దీంతో ప్రీపెయిడ్ ప్లాన్‌లో సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచేందుకు అయ్యే ఖర్చు మునుపటి కంటే గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చౌకైన ధరలో అందుబాటులో ఉన్న రీఛార్జ్ ప్లాన్​ల గురించి తెలుసుకుందాం రండి.

2025లో చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లు ఇవే!:

జియో రూ.189 ప్లాన్: మీరు జియో యూజర్ అయితే మీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచేందుకు రూ.189 రీఛార్జ్ ప్లాన్ అత్యంత సరసమైన ఎంపిక. ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్​తో అన్​లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 SMS, 2GB డేటా లభిస్తుంది. అదనంగా ఇది JioTV, JioCloud వంటి Jio యాప్‌లకు యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్: ఎయిర్‌టెల్ వినియోగదారులు తమ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకునేందుకు అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్ రూ. 199. ఇది రిలయన్స్ జియో చౌకైన ప్లాన్ కంటే 10 రూపాలయలే ఎక్కువ ఖరీదైనది. ఈ ప్లాన్​ వ్యాలిడిటీ కూడా జియో మాదిరిగానే 28 రోజులే. ఇక ఈ ప్లాన్​తో అన్​లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అంతేకాకుండా కంపెనీ ఈ రీఛార్జ్ ప్లాన్​తో మొత్తం 2GB డేటాను కూడా అందిస్తుంది.

వోడాఫోన్ ఐడియా (Vi): Vi వినియోగదారులకు అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్ ధర వారి ప్రాంతాన్ని బట్టి మారుతుంది. కొన్ని సర్కిల్‌లలో రూ.99 రీఛార్జ్ ప్లాన్ ఉంది. మరికొన్ని ప్రాంతాలలో రూ.155 ప్లాన్ ఉంది.

వీటిలో రూ.99 రీఛార్జ్ ప్లాన్ 15 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్​తో 500MB డేటా, రూ.99 టాక్ టైమ్, స్టాండర్డ్ ధరలకు 1900కు పోర్ట్-అవుట్ SMS పంపగల సామర్థ్యం తప్ప వేరే SMS ప్రయోజనాలు లేవు.

ఇక రూ.155 రీఛార్జ్ ప్లాన్ 20 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్​తో అన్​లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 SMS, ఇంటర్నెట్ బ్రౌజ్ చేసేందుకు 1GB డేటాను అందిస్తుంది.

BSNL రూ.59 ప్లాన్: అన్నింటికంటే BSNL ఏడు రోజుల వ్యాలిడిటీతో రూ.59కి అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ అన్​లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1GB రోజువారీ డేటాను అందిస్తుంది. అయితే మీరు రీఛార్జ్ ప్లాన్‌ను ఇంకొంచెం ఎక్కువ కాలం పొడిగించాలనుకుంటే మీరు రూ.99కి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది 17 రోజుల చెల్లుబాటును కలిగి ఉంటుంది. అయితే కంపెనీ ఈ ప్లాన్​లో అన్​లిమిటెడ్ కాలింగ్‌ మాత్రమే అందిస్తుంది. ఈ ప్లాన్ SMS, డేటా వంటి ఇతర ప్రయోజనాలతో రాదు.

వీటన్నింటిలో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ ఏది?: BSNL రూ.59 ప్లాన్ అత్యంత సరసమైన రీఛార్జ్ ప్లాన్ కానీ ఇది ఒక వారం మాత్రమే ఉంటుంది. ఇక ఒక నెల పాటు జియో రూ.189 రీఛార్జ్ ప్లాన్.. ఎయిర్​టెల్ రూ.199 కంటే చౌకైనది. కానీ జియోతో పోలిస్తే ఈ ఎయిర్​టెల్​ ప్లాన్​ ఎక్కువ రోజువారీ SMSలను అందిస్తుంది. ఇందులో గమనించదగ్గ విషయం ఏంటంటే.. వీఐ (Vi) రూ.99 రీఛార్జ్ ప్లాన్ ప్రైవేట్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో అత్యంత చౌకైనది. కానీ ఇది మినిమల్ బెనిఫిట్స్​ను మాత్రమే అందిస్తుంది.

ఎయిర్​టెల్ యూజర్లకు గుడ్​న్యూస్- ఆ ప్లాన్​ల​తో 'యాపిల్ TV+' ఫ్రీ యాక్సెస్!

ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్​న్యూస్- ఇకపై ఆ ఫోన్​లకు 8 ఏళ్ల పాటు OS, సెక్యూరిటీ అప్​డేట్స్!

ట్రిపుల్ కెమెరా సెటప్​తో నథింగ్ ఫోన్ 3a సిరీస్- డిజైన్ కూడా రివీల్- టీజర్​ చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.