Uttarakhand Rescue Team Interview About SLBC Accident : ఎస్‌ఎల్‌బీసీలో కొనసాగుతున్న రక్షణ చర్యలకు సహాయం చేసేందుకు ఉత్తరాఖండ్ బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ బృందం గతంలో ఉత్తరాఖండ్‌లో సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో సుమారు 42 మందిని రక్షించారు. నిన్న వెళ్లినప్పుడు చివరి 100 మీటర్ల వరకు చేరుకున్నా అక్కడి పరిస్థితిని చెపుతామంటున్నారు. సొరంగంలోకి వెళ్తున్న ఉత్తరాఖండ్ బృందంతో మా ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి ముచ్చటించారు.
నిన్న వెళ్లినప్పుడు వంద మీటర్ల దూరంలో నిలిచిపోవాల్సి వచ్చిందని, ఇవాళ పూర్తి సామాగ్రితో వెళ్తున్నామని సిబ్బంది తెలిపారు. వారిని రక్షించేందుకు తమ పూర్తిస్థాయి సామర్థ్యంతో శ్రమిస్తున్నామని చెప్పారు. టెన్నెల్ బోరింగ్ మిషన్ సొరంగంలో అడ్డుగా ఉన్నందున మరింత ముందుకు వెళ్లడం కష్టంగా ఉందన్నారు. ఇవాళ మరోసారి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. లోపల అంతా బురదగా ఉండటం వల్ల కిలోమీటర్ మేర నడవటం చాలా కష్టంగా ఉంది. ఇవాళ తాళ్లు, లైట్ల సాయంతో మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ టీబీఎం ముందుకు చేరుకుంటే లోపల చిక్కుకున్న వారి గురించి తెలిసే అవకాశం ఉందంటున్నారు.
ఆ ఎనిమిది మందిని బయటకు తీసుకురావడానికి సర్వశక్తులు ఉపయోగిస్తాం - మంత్రుల బృందం