ETV Bharat / sports

లక్ష్యసేన్​కు చుక్కెదురు - ఎఫ్ఐఆర్ కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరణ! -ఏం జరిగిందంటే? - LAKSHYA SEN AGE CONTROVERSY

బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్​కు పెను కష్టాలు : ఎఫ్ఐఆర్ కొట్టివేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరణ- ఏం జరిగిందంటే?

Karnataka High Court Rejects Lakshya Sens Plea
Lakshya Sen (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 25, 2025, 4:06 PM IST

Karnataka High Court Rejects Lakshya Sens Plea : ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ కు షాక్!.వయసు విషయంలో తప్పుడు సమాచారాన్ని అందించి ఎందరో క్రీడాకారులకు రావాల్సిన అవకాశాలను కాజేశారంటూ లక్ష్య సేన్, అతని కుటుంబ సభ్యులు, కోచ్ విమల్ కుమార్​పై నమోదైన ఎఫ్ఐఆర్​ను కొట్టివేయడానికి కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

కోర్టును ఆశ్రయించిన లక్ష్యసేన్
బెంగళూరులోని ఎనిమిదో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో తమపై నమోదైన ఎఫ్ఐఆర్​ను కొట్టివేయాలని కోరుతూ లక్ష్యసేన్, కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 19న పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​ను న్యాయమూర్తి జస్టిస్ ఎంజీ ఉమా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఈ ఎఫ్ఐఆర్​లను కొట్టేయలేమని తీర్పునిచ్చారు.

'లక్ష్యసేన్​ను వేధించడానికి కేసులు'
లక్ష్యసేన్​ను వేధించడానికే ఫిర్యాదుదారులు ఉద్దేశపూర్వకంగా ఈ కేసులు పెట్టారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు ఎదుట వాదించారు. లక్ష్యసేన్​పై ఫిర్యాదు నిరాధారమైనదని ఆరోపించారు. అయితే, కంప్లైంట్ చేసిన వ్యక్తి డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించారని, ఈ దశలో కేసును కొట్టివేయడం సరికాదంటూ హైకోర్టు వెల్లడించింది. ఈ క్రమంలో హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు లక్ష్యసేన్ తరఫు న్యాయవాదులు.

ఇదీ జరిగింది :
బ్యాడ్మింటన్ టోర్నమెంట్లకు అర్హత సాధించడానికి, ప్రభుత్వ ప్రయోజనాలను పొందడానికి లక్ష్య సేన్ తన వయసును రెండున్నర ఏళ్లు తగ్గించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక బ్యాడ్మింటన్ అసోసియేషన్​కు తప్పుడు సమాచారంతో ఫేక్​ ఏజ్​ సర్టిఫికెట్​ను సమర్పించాడని అని గోవియప్ప నాగరాజా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా లక్ష్యసేన్ వయసుకు సంబంధించిన అధికారిక పత్రాలను పొందారు. దీని ఆధారంగా ఏసీఎంఎం కోర్టు హైగ్రౌండ్స్ పోలీసులను లక్ష్యసేన్, ఇతరులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అలాగే ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ ఎఫ్​ఐఆర్​ను కొట్టేయాలని లక్ష్యసేన్ కోర్టును ఆశ్రయించగా ఆయనకు కోర్టులో చుక్కెదురైంది.

లక్ష్యసేన్ పెర్ఫామెన్స్​పై దిగ్గజ క్రికెటర్ ఫైర్​ - రోహిత్ శర్మ స్టైల్​లో కామెంట్స్​ - Sunil Gavaskar Paris Olympics 2024

రూ.72.03 కోట్లు ఖర్చు చేస్తే పతకాలు సున్నా - ఒలింపిక్స్​లో నిరాశపరిచిన బ్యాడ్మింటన్​ - Paris Olympics 2024 Badminton

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.