ETV Bharat / sports

25 ఏళ్లకే ప్రపంచ రికార్డు - క్రికెట్​లోనే ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్​ రచినే - RACHIN RAVINDRA CENTURY RECORD

రచిన్‌ పేరిట రేర్​ రికార్డు - ప్రపంచంలోనే ఆ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌ ఇతనే

Rachin Ravindra Century Record
Rachin Ravindra (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 25, 2025, 3:48 PM IST

Rachin Ravindra World Record : గాయం కారణంగా వన్డే సిరీస్​కు దూరమైన న్యూజిలాండ్ యంగ్​ క్రికెట్ ర‌చిన్ ర‌వీంద్ర తాజాగా అదిరిపోయే ఇన్నింగ్స్​తో సత్తా చాటాడు. రీసెంట్​గా ఛాంపియన్స్​ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్​తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సెంచ‌రీతో చెలరేగిపోయాడు. అలా తన కమ్​బ్యాక్​ను గ్రాండ్​గా సెలబ్రేట్ చేసుకున్నాడు.

237 ప‌రుగుల ల‌క్ష్యాన్నిఛేదించే క్రమంలో 15 ప‌రుగుల‌కే రెండు కీల‌క వికెట్లు కోల్పోయి కుప్పకూలిన కివీస్‌ను ర‌చిన్ తన ఇన్నింగ్స్​తో ఆదుకున్నాడు. టామ్ లాథ‌మ్‌, డెవాన్ కాన్వేతో క‌లిసి కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు. అలా 95 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే ఆ మ్యాచ్​లో ఓవరాల్‌గా 105 బంతులు ఎదుర్కొన్న రచిన్‌, 12 ఫోర్లు, అలాగే ఓ సిక్సర్‌తో 112 పరుగులను స్కోర్ చేసి పెవిలియన్ బాట పట్టాడు.

అయితే తన సూపర్ సెంచరీతో జట్టును గట్టెక్కించడం వల్ల కివీస్ తమ ల‌క్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 46.1 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. అందుకుంది. దీంతో త‌మ సెమీస్ బెర్త్‌ను న్యూజిలాండ్ ఖారారు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో శ‌త‌కొట్టిన ర‌వీంద్ర ప‌లు అరుదైన ఘ‌న‌త‌ల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

రచిన్ ఖాతాలో పడ్డ రికార్డులు ఇవే!
వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా రెండింటిలోనూ అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన ఏకైక బ్యాటర్‌గా ర‌చిన్ చరిత్రకెక్కాడు. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే అతడు సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత తాజాగా బంగ్లాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ తొలి మ్యాచ్‌లోనూ శ‌తకంతో చెలరేగిపోయాడు.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు 19 మంది మాత్రమే త‌మ అరంగేట్ర మ్యాచ్‌లో సెంచ‌రీ సాధించారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో 15 మంది ప్లేయర్లు తమ ఫస్ట్ మ్యాచ్‌లోనే 100 పరుగులు తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ రెండు ఈవెంట్ల‌ అరంగేట్ర మ్యాచ్‌ల్లో సెంచ‌రీ స్కోర్ చేసిన తొలి ప్లేయ‌ర్​గా రచిన్ రికార్డుకెక్కడం విశేషం.

ఇదిలా ఉండగా, రచిన్​ తన కెరీర్‌లో నాలుగు వ‌న్డే సెంచరీలు సాధించగా, అవన్నీ ఐసీసీ వేదికలపైనే నమోదు కావడం మరో విశేషం. ఈ క్రమంలో ఐసీసీ వన్డే ఈవెంట్లలో అత్యధిక సెంచరీలు సాధించిన కివీస్‌ బ్యాటర్‌గానూ రచిన్‌ మరో అరుదైన ఘనతను సాధించాడు. అయితే ఇప్పటివరకు ఆ రికార్డు న్యూజిలాండ్‌ స్టార్‌ ప్లేయర్‌ కేన్‌ విలియమ్సన్‌(3) పేరిట ఉండేది.

'లో క్వాలిటీ' వల్లే రచిన్​కు గాయం?- PCBపై నెటిజన్లు ఫైర్!

'CSK లిమిట్ క్రాస్ చేయకూడదు- ఫ్రాంచైజీ కంటే దేశమే ముఖ్యం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.