Nothing Phone 3a Series Launch: నథింగ్ ఫోన్ 3a సిరీస్ మార్చి 4న భారతదేశంలో సహా ప్రపంచవ్యాప్తంగా లాంఛ్ కానుంది. ఈ సిరీస్‌లో కంపెనీ 'నథింగ్ ఫోన్ 3a', 'నథింగ్ ఫోన్ 3a ప్రో' అనే రెండు ఫోన్లను లాంఛ్ చేయొచ్చు. ఈ 'నథింగ్ ఫోన్ 3a' సిరీస్ లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ కొన్ని వారాల క్రితమే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కంపెనీ దీని కెమెరా డిజైన్‌ను కూడా వెల్లడించింది. ఇప్పుడు తొలిసారిగా కంపెనీ తన అప్‌కమింగ్ ఫోన్ సిరీస్ డిజైన్‌ను అధికారికంగా రివీల్ చేసింది.
నథింగ్ ఫోన్ 3a సిరీస్ టీజర్: నథింగ్ ఈ అప్‌కమింగ్ సిరీస్ టీజర్‌ను తన అధికారిక సోషల్‌మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఈ పోస్ట్‌లో ఫోన్ బ్యాక్ డిజైన్‌ను రివీల్ చేసింది. కంపెనీ రిలీజ్ చేసిన ఈ టీజర్లో ఫోన్ వెనక భాగంలో మధ్యలో వృత్తాకార కెమెరా మాడ్యూల్ కన్పిస్తుంది. నథింగ్ పాత మోడల్ ఫోన్లలో ఉన్నట్లుగా ఇది మూడు గ్లిఫ్ LEDలతో వస్తుంది.
Meet Phone (3a) Series. First hands-on experience with NEO Gamma.@1x_tech pic.twitter.com/U7vuinDVR7
— Nothing (@nothing) February 24, 2025
ఇక ఈ ఫోన్ కెమెరా మాడ్యూల్లో మూడు కెమెరా సెన్సార్లు కన్పిస్తాయి. దీనిలో ఒక కెమెరా సెన్సార్ పెరిస్కోప్ లెన్స్‌తో వస్తుంది. ఫోన్ వెనక భాగంలో LED ఫ్లాష్ యూనిట్ కూడా కన్పిస్తుంది. వీటితో పాటు ఈ ఫోన్ కుడి వైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ కూడా ఉండటం చూడొచ్చు. తన అధికారిక వీడియోలలో ఒకదానిలో 'నథింగ్ ఫోన్ 3a' సిరీస్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుందని కంపెనీ కన్ఫార్మ్ చేసింది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'నథింగ్ ఫోన్ 3a' గురించి కూడా కంపెనీ ఆ వీడియోలోనే టీజ్ చేసింది.
నథింగ్ ఫోన్ 3a సిరీస్ స్పెసిఫికేషన్లు: 'నథింగ్ ఫోన్ 3a' సిరీస్ టీజర్ ప్రకారం కంపెనీ ఈ సిరీస్ హై-ఎండ్ మోడల్ అంటే 'నథింగ్ ఫోన్ 3a ప్రో' మోడల్‌లో మాత్రమే పెరిస్కోప్ కెమెరాను అందించొచ్చని తెలుస్తోంది. ఈ ఫోన్ వెనక భాగంలో 50MP ప్రైమరీ సెన్సార్ అందించనున్నట్లు కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తుంది. ఫోన్ సెకండ్ వెనక కెమెరా 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. దీని థర్డ్ కెమెరా OIS సపోర్ట్‌తో 50MP సోనీ పెరిస్కోప్ లెన్స్‌తో వస్తుంది. వీటితోపాటు సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో కంపెనీ 50MP ఫ్రంట్ కెమెరాను కూడా అందించొచ్చు.
Phone (3a) Series.
— Nothing (@nothing) February 24, 2025
Where technical intricacy meets purity. The essence of Nothing. pic.twitter.com/02UEwkgROl
ఇక ఈ సిరీస్ బేస్ మోడల్‌లో అంటే 'నథింగ్ ఫోన్ 3a'లో కంపెనీ మూడు బ్యాక్ కెమెరాలను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లోని రెండు మోడళ్లలోనూ ప్రాసెసర్ కోసం స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 SoC చిప్‌సెట్ ఇవ్వొచ్చు. ఈ రెండు మోడల్ ఫోన్‌లు నథింగ్‌కు చెందిన OS Nothing OS 3పై రన్ కావచ్చు. ఇది బహుశా గూగుల్ లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ 'Android 15'పై ఆధారపడి ఉంటుంది.
M4 చిప్‌తో యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్స్- రిలీజ్ ఎప్పుడంటే?
మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలా?- అయితే కాస్త ఆగండి- త్వరలో కిర్రాక్ మోడల్స్ లాంఛ్!
MyJio యాప్- రీఛార్జ్‌లకు మాత్రమే కాదు, కరెంట్ బిల్లు పేమెంట్స్‌కు కూడా!- ఎలాగంటే?