ETV Bharat / health

పన్ను నొప్పిని లైట్ తీసుకుంటున్నారా? ఇది ప్రొస్టేట్ క్యాన్సర్​కు వార్నింగ్! లక్షణాలేంటో తెలుసా? - PROSTATE CANCER SYMPTOMS

-ప్రొస్టేట్ క్యాన్సర్​ లక్షణాలు ఏంటో తెలుసా? -ఈ జాగ్రత్తలు తీసుకుంటే తప్పించుకోవచ్చట!

Prostate Cancer Symptoms
Prostate Cancer Symptoms (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Feb 25, 2025, 3:25 PM IST

Prostate Cancer Symptoms : మీ పన్ను నొప్పిగా ఉందా? ఏదో దంతాల సమస్య అని లైట్ తీసుకుంటున్నారా? అయితే వెంటనే జాగ్రత్త పడండి! ప్రొస్టేట్ క్యాన్సర్​కు పన్ను నొప్పి కూడా ఓ లక్షణమేనని నిపుణులు చెబుతున్నారు. పురుషుల్లో కనిపించే అత్యంత భయంకరమైనది ప్రోస్టేట్‌ క్యాన్సర్‌. అందుకే, వ్యాధి ముదరకుండా తొలిదశలోనే గుర్తించి జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు. కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా పన్ను నొప్పిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పన్ను నొప్పికి ప్రొస్టేట్‌ క్యాన్సర్​కు సంబంధం ఏంటి? ఈ వ్యాధి లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పన్ను నొప్పికి ప్రొస్టేట్ క్యాన్సర్ సంబంధం ఏంటి?
పన్ను నొప్పికి ప్రొస్టేట్ క్యాన్సర్​కు సంబంధం ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణ దంత సమస్యలాగా అనిపించినా.. ఇది క్యాన్సర్​కు ముందస్తు సూచికగా భావించాలని నిపుణులు అంటున్నారు. నోటిలో వాపు, బ్యాక్టీరియా ఇన్​ఫెక్షన్లు ప్రొస్టేట్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా పెరిడోంటిటిస్ అనే తీవ్రమైన చిగుళ్ల వ్యాధి, నోటి ఇన్​ఫెక్షన్లు వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని వివరిస్తున్నారు. తరచూ దంతాల సమస్యతో వైద్యుడిని సంప్రదించిన ఓ వ్యక్తి తర్వాత ఈ క్యాన్సర్ బారిన పడినట్లు తెలిపారు. అందుకే దీనిని ముందస్తు హెచ్చరికగా భావించి.. క్యాన్సర్ తీవ్రం కాకముందే చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. (నేషనల్ హెల్త్ పబ్లికేషన్ రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలు

  • చిగుళ్ల వాపు, నోటి ఇన్​ఫెక్షన్లు
  • దవడ, దంతాల్లో భరించలేని నొప్పి
  • తగ్గని నోటి పూతలు, పుండ్లు
  • తరచూ మూత్ర విసర్జన
  • మూత్రం సాఫీగా రాకపోవడం, నొప్పి లేదా మంట
  • మూత్రం పోసే సమయంలో ఇబ్బందులు
  • మూత్రం, వీర్యంలో రక్తం పడడం
  • తుంటి, వెన్నులో నొప్పి
  • కూర్చున్నా, కదిలినా కొన్నిసార్లు నొప్పి రావడం
  • బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం
  • తరచూ అలసటగా అనిపించడం
  • పొత్తి కడుపు కింది భాగంలో నొప్పి
  • వీపు, ఇతర భాగాలలో ఉండే ఎముకల్లో నొప్పి రావడం
Prostate Cancer Symptoms
ప్రొస్టేట్ క్యాన్సర్​ (Getty Images)

ఈ పరీక్షలతో తెలుసుకోవచ్చు?
పన్ను నొప్పి రావడం కేవలం దంతాల సమస్య మాత్రమే కాదని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు ముందస్తు హెచ్చరికని వెల్లడిస్తున్నారు. అందుకే నోటి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని అంటున్నారు. ఇంకా పన్ను నొప్పితో పాటు మూత్ర సమస్యలు, నొప్పి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. మొదటి దశలోనే ఉంటే చికిత్సతో ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. 'ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్' అనే రక్త పరీక్ష, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అనే రెండు రకాల పరీక్షల ద్వారా ప్రొస్టేట్ క్యాన్సర్​ను గుర్తిస్తారని వివరిస్తున్నారు.

Prostate Cancer Symptoms
పన్ను నొప్పి (Getty Images)

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా ఉండటానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రోజూ శరీరక శ్రమను కలిగించే వాకింగ్‌, జాగింగ్ వంటి వాటిని చేయాలని సలహా ఇస్తున్నారు. ఇంకా పొగ తాగడం, మద్యం సేవించడం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా బరువును నియంత్రణలో ఉంచుకోవాలని తెలిపారు. ఈ జాగ్రత్తలతో ఈ వ్యాధి బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

Prostate Cancer Symptoms
ప్రొస్టేట్ క్యాన్సర్​ (Getty Images)

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

లేడీస్​కు కడుపునొప్పి ఎందుకు వస్తుంది? పీరియడ్స్ పెయిన్ కాకుండా కారణం ఏంటో తెలుసా?

షుగర్ పేషెంట్లకు సూపర్ ఫుడ్- చద్దన్నంతో ఎంతో ఆరోగ్యం- అనేక సమస్యలకు చెక్!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.