IRCTC The Splendors of Dubai Tour: దుబాయ్.. ప్రతి ఒక్కరూ సందర్శించాలనుకునే అందమైన, అద్భుతమైన డెస్టినేషన్. ఇది ప్రపంచంలోని మేటి అంతర్జాతీయ నగరాల్లో ఒకటి. ఎత్తైన ఆకాశ హార్మ్యాల నుంచి ఎడారిలో విహరించే వరకు ఎన్నో రకాల ఎంటర్‌టైన్మెంట్ కార్యకలాపాలు అందుబాటులో ఉంటాయి. అందుకే ఎక్కువ మంది ఇక్కడికి వెళ్లాలని భావిస్తారు. అయితే వెళ్లాలని ఉన్నా.. ఎలా వెళ్లాలి? ఖర్చు ఎక్కువ అనే విషయాల దగ్గర కొద్దిమంది ఆలోచిస్తారు. తాజాగా అలాంటి వారి కోసం ఐఆర్సీటీసీ అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది. దుబాయ్ వెళ్లి ఎంజాయ్ చేసేందుకు ఆకర్షణీయమైన ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి ధర ఎంత? టూర్ ఎన్ని రోజులు ఉంటుంది? ఏఏ ప్రదేశాలు కవర్ అవుతాయి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ది స్ప్లెండర్స్ ఆఫ్ దుబాయ్ పేరుతో ప్యాకేజీ ప్రకటించింది. ఇది హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ మొత్తం 4 రాత్రులు, 5 పగళ్లు కొనసాగుతుంది. ఈ ప్యాకేజీలో దుబాయ్, అబుదబిలోని పలు ప్రదేశాలు విజిట్ చేయవచ్చు. ఈ టూర్లో 34 మంది ప్రయాణికులకు అవకాశం ఉంటుంది. కాబట్టి వెళ్లాలనుకునేవారు ముందుగానే బుక్ చేసుకోవాలి. ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు ఉదయం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని దుబాయ్ స్టార్ట్ అవుతారు. మధ్యాహ్నం 1 గంటకు దుబాయ్ రీచ్ అవుతారు. అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని లంచ్‌కు ఇండియన్ రెస్టారెంట్‌కు వెళ్తారు. లంచ్ తర్వాత ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు వెళ్లి చెకిన్ అవుతారు. ఆ తర్వాత మిరాకిల్ గార్డెన్, గ్లోబల్ విలేజ్ విజిట్ చేస్తారు. రాత్రికి గ్లోబల్ విలేజ్‌లో డిన్నర్ కంప్లీట్ చేసి తిరిగి హోటల్‌కు చేరుకుని ఆ రాత్రికి అక్కడ స్టే చేస్తారు.
- రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హాఫ్ డే దుబాయ్ సిటీ టూర్ ఉంటుంది. అందులో భాగంగా దుబాయ్ మ్యూజియం విజిట్ చేస్తారు. ఇండియన్ రెస్టారెంట్లో లంచ్ ఉంటుంది. సాయంత్రం సఫారీ ఉంటుంది. డిన్నర్ పూర్తి చేసిన తర్వాత హోటల్‌కు చేరుకుని ఆ రాత్రికి స్టే చేస్తారు.
- మూడో రోజు టిఫెన్ తర్వాత దుబాయ్ ఫ్రేమ్, మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ విజిట్ చేస్తారు. ఇండియన్ రెస్టారెంట్లో లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత షాపింగ్ చేసుకోవచ్చు. ధౌ క్రూజ్‌లో డిన్నర్ ఉంటుంది. అనంతరం హోటల్‌కు కు చేరుకుని ఆ రాత్రికి స్టే చేస్తారు.
- నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్ అవుట్ చేసిన తర్వాత అబుదాబి సిటీ టూర్ ఉంటుంది. అందులో భాగంగా గ్రాండ్ మసీదు, BAPS హిందూ మందిర్ దర్శించుకుంటారు. ఇండియన్ రెస్టారెంట్లో లంచ్ ఉంటుంది. ఆ తర్వాత దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్ ఫౌంటెన్ షో విజిట్ చేస్తారు. ఆ తర్వాత డిన్నర్ ఉంటుంది. అనంతరం దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు.
- ఐదో రోజు తెల్లవారుజామున దుబాయ్ నుంచి ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. 9 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ధర వివరాలు:
- కంఫర్ట్‌లో సింగిల్ షేరింగ్‌కు రూ.1,21,100, డబుల్ షేరింగ్‌కు రూ.1,04,620, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. రూ.1,02,225 గా నిర్ణయించారు.
- ఇక 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.99,955, విత్ అవుట్ బెడ్ అయితే రూ.90,630 చెల్లించాలి.
ప్యాకేజీలో ఉండేవి ఇవే:
- ఫ్లైట్ టికెట్లు(హైదరాబాద్ - దుబాయ్ - హైదరాబాద్)
- హోటల్ అకామిడేషన్
- 3 బ్రేక్‌ఫాస్ట్‌లు, 4 లంచ్, 4 డిన్నర్
- లోకల్ టూర్ గైడ్
- ట్రావెల్ ఇన్సూరెన్స్
- వీసా ఛార్జెస్
- ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ జనవరి 23, 2025వ తేదీన అందుబాటులో ఉంది.
- ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
IRCTC మహా కుంభమేళా ప్యాకేజీ - తక్కువ ధరలోనే అయోధ్య, వారణాసి కూడా!
"మంచు కురిసే వేళలో కశ్మీరీ లోయలో" - IRCTC అద్భుతమైన ప్యాకేజీ - ధర కూడా తక్కువేనండోయ్!