Precautions to Theft Proof Home Before Going To Villages : ఈ మధ్యకాలంలో తాళం వేసిన ఇళ్లల్లోనే ఎక్కువగా చోరీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో ఇళ్లకు తాళం వేసి ఇతర పట్టణాలు, పల్లెలకు వెళ్తుంటారు. వచ్చేసరికి చోరీలు జరిగి నగదు, నగలు మాయమవుతాయి. కొన్ని ఏర్పాట్లు చేసుకుని జాగ్రత్తలు తీసుంటే ఇలాంటి పరిస్థితులే ఉండవు. సంక్రాంతి పండుగకు పట్టణాల్లో ఉంటున్న చాలా కుటుంబాలు పల్లెలకు వెళ్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ఈటీవీ భారత్ కథనం
ఊళ్లకు వెళ్లేటప్పుడు బంగారం, వెండి ఆభరణాలు బీరువాలో పెట్టి తాళం వేసి వెళ్తుంటారు. అలాంటివి బ్యాంకు లాకర్స్‌లో భద్రంగా పెట్టుకోవచ్చు. ప్రాంతం, బ్యాంకు, లాకర్ పరిమాణాన్ని బట్టి ఏడాదికి రూ.1,500 నుంచి రూ.8వేల వరకు రెంట్ తీసుకుంటారు. చిన్న లాకర్ కోసం మండల ప్రాంతాల్లో ఏడాదికి రూ.1,500 అంటే నెలకు రూ.125, జిల్లా కేంద్రంలో రూ.2వేల నెలకు రూ.167 చెల్లించాల్సి ఉంటుంది.
సెన్సార్ పెట్టుకుంటే మంచిది : ఇంట్లోకి కొత్త వ్యక్తులు వచ్చి గేటు పట్టుకుంటే సైరన్ మోత వచ్చేలా పరికరాలు అమర్చుకుంటే మంచిది. ఈ పరికరాలు గుర్తుతెలియని వ్యక్తులు వస్తే సెన్సార్‌తో గుర్తించి అలారం మోగిస్తాయి. ఇంట్లో ఉన్నవారు, ఇంటిపక్కన ఉన్నవారు కూడా అప్రమత్తం అయ్యే అవకాశముంటుంది. అవసరం లేదు అన్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు.
ఇంటి లోపలి నుంచి తాళం : దొంగలు పగటి పూట కాలనీల్లో రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో తమ పని కానిస్తారు. ఇంటి ముందున్న గేటుకు ముందు కంటే లోపలి నుంచి తాళం వేసుకుంటే మంచిది. ప్రధాన గేటుకు, ఇంటి తలుపులకు తాళం ఉందో లేదో చెక్ చేస్తారు. లోపలి నుంచి తాళం వేసి ఉంటే ఇంట్లో ఉన్నారు అనుకుంటారు. బయట నుంచి తాళం ఉంటే ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని చోరీ చేస్తారు.
సీసీ కెమెరాల ఏర్పాటు : ప్రస్తుతం కాలంలో ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకోవడం మంచిది. పొరుగు ఊరికి వెళ్లినా ఇంటి దగ్గర ఏం జరుగుతుందో సెల్ఫోన్లోనే తెలుసుకోవచ్చు. అనుమానితులు కానీ, దొంగలు వస్తే ఇంటి పక్కన వారికి లేదా కాలనీలో ఉన్నవారికి చెప్పి అప్రమత్తం చేయొచ్చు. పోలీసులు కూడా సమాచారం ఇవ్వొచ్చు.
లైట్లు వేసి ఉంచాలి : ఇంట్లో లేని సమయంలో ముందున్న గదుల్లో లైట్లు వేసి ఉంచాలి. దీనివల్ల ఇంట్లోవాళ్లు ఉన్నారని భావిస్తారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినా వెలుగులో ఇంటి పక్కింటివారు, ఇతరులు చూడటానికి వీలు ఉంటుంది.
ఒక్క తలుపు ఉన్నది బెటర్ : ఇంటి తాళాలను దొంగలు సులువుగా పగుల గొట్టి చోరీసు చేస్తున్నారు. తలుపు లేపలే ఉండే తాళాలు అమర్చుకుంటే ధ్వంసం చేయడానికి వీలు ఉండదు. ఇలాంటివి ఇళ్లకు తలుపులకు అమర్చుకోవాలి. తలుపునకు వేసే తాళం ఇనుప కడ్డీ గోడలోకి వెళ్లేలా ఉంటే మంచిది. ఇంటి తలుపులు రెండు కాకుండా ఒకటి ఉన్నది అమర్చుకోవడం ఉత్తమం.
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? - 'మాకు చెప్పండి - మీ ఇంటికి మేం కాపలా కాస్తాం'
రూట్ మార్చిన సెల్‌ఫోన్ దొంగలు - ఫోన్ కొట్టేశారో యూపీఐతో బ్యాంకు ఖాతాలు ఖాళీ
ప్రయాణం వేల జర పైలం - ఏమరపాటుగా ఉన్నారో మీ వస్తువులు ఆగం - Travel Safety Tips In Telugu