IRCTC Madhya Pradesh Jyotirlinga Darshan Package: కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ సంవత్సరం మొత్తం బాగుండాలని, ఆనందంగా జీవించాలని చాలా మంది కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి దేశంలోని ప్రముఖ దేవాలయాలను దర్శించుకుంటారు. మరి మీరు కూడా అలాంటి ప్లాన్స్ వేస్తున్నారా? అయితే ఈ కొత్త సంవత్సరంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండింటిని ఓకే ట్రిప్‌లో దర్శించుకునేందుకు వీలుగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి ఆ ప్యాకేజీ ఏంటి? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు కవర్ అవుతాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
మధ్యప్రదేశ్‌లో రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఒకటి ఉజ్జయిని మహా కాళేశ్వరుని ఆలయం, రెండోది ఓంకారేశ్వర ఆలయం. ఈ రెండింటితో పాటు మరికొన్ని ఆలయాలను, పర్యాటక ప్రదేశాలను సందర్శించుకునేందుకు వీలుగా.. ఐఆర్సీటీసీ 'మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్' పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఉంటుంది. టూర్ ప్రకటించిన తేదీల్లో ప్రతి బుధవారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు సాయంత్రం 4:40 గంటలకు కాచిగూడ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు (ట్రైన్ నెం.12707) బయల్దేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 8:15 గంటలకు భోపాల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు వెళ్లి చెకిన్ అయ్యి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత సాంచి స్థూపం, భోజేశ్వర్ మహాదేవ్ టెంపుల్‌ను దర్శించుకుని తిరిగి భోపాల్ చేరుకుంటారు. సాయంత్రం ట్రైబల్ మ్యూజియం వీక్షిస్తారు. ఆ రాత్రికి భోపాల్‌లోనే స్టే ఉంటుంది.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ చేశాక ఉజ్జయినికి బయల్దేరుతారు. అక్కడ హోటల్లో చెకిన్ అయిన తర్వాత ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయం, హరసిద్ధి ఆలయం, మంగళనాథ్ ఆలయం, నవగ్రహ శని మందిరం, శ్రీ చింతామన్ గణేష్ ఆలయం, రామ్ ఘాట్, శ్రీ గఢ్కాళికా ఆలయాలను దర్శించుకుంటారు. ఆ రాత్రి ఉజ్జయినిలోనే బస ఉంటుంది.
- నాలుగో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మహేశ్వర్‌కు స్టార్ట్ అవుతారు. అక్కడ అహిల్యాదేవి కోట, నర్మదా ఘాట్‌ను సందర్శిస్తారు. అక్కడి నుంచి ఓంకారేశ్వర్‌కు బయలుదేరుతారు. అక్కడ ఓంకారేశ్వర దేవాలయాన్ని దర్శించుకుంటారు. రాత్రికి ఓంకారేశ్వర్‌లో బస ఉంటుంది.
- ఐదో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఇందౌర్‌కు బయల్దేరుతారు. అక్కడ లాల్బాగ్ ప్యాలెస్, గణేష్ మందిరాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత ఇందౌర్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. రాత్రి 8 గంటలకు రిటర్న్ జర్నీ(ట్రైన్ నెం: 19301) స్టార్ట్ అవుతుంది. ఆ రోజు రాత్రంతా జర్నీ ఉంటుంది.
- ఆరో రోజు రాత్రి 10 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ పూర్తవుతుంది.
ప్యాకేజీ ధరలు చూస్తే: 1 - 3 ముగ్గురు వ్యక్తులు బుక్ చేసుకుంటే..
- కంఫర్ట్‌లో ఒక్కో ప్రయాణికుడికి సింగిల్ షేరింగ్‌కి రూ.36,190, ట్విన్ షేరింగ్‌కు రూ.20,360, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.15,880 చెల్లించాలి. 5 - 11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌కు రూ.12,010, విత్ అవుట్ బెడ్ అయితే రూ.10,110 చెల్లించాలి.
- స్టాండర్ట్‌లో సింగిల్ షేరింగ్‌కి రూ.33,680, ట్విన్ షేరింగ్‌కు రూ.17,850, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,380. ఇక 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.9,500, విత్ అవుట్ బెడ్ అయితే రూ. 7,600 చెల్లించాలి.
నలుగురు నుంచి ఆరుగురు కలిసి బుక్ చేసుకుంటే..
- కంఫర్ట్‌లో డబుల్ షేరింగ్‌కు రూ.16,730, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.14,330 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ. 12,010, విత్ అవుట్ బెడ్ అయితే రూ.10,110 చెల్లించాలి.
- స్టాండర్డ్‌లో డబుల్ షేరింగ్‌కు రూ. 14,220, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.11,820 చెల్లించాలి. 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు విత్ బెడ్‌తో రూ.9,500, విత్ అవుట్ బెడ్ అయితే రూ. 7,600 చెల్లించాలి.
ప్యాకేజీలో ఉండేవి ఇవే:
- ట్రైన్ టికెట్లు(హైదరాబాద్ - భోపాల్/ఇందౌర్ - హైదరాబాద్)
- సైట్ సీయింగ్ కోసం ప్యాకేజీని బట్టి వెహికల్
- హోటల్ అకామిడేషన్
- బ్రేక్‌ఫాస్ట్
- ట్రావెల్ ఇన్సూరెన్స్
- ప్రస్తుతం ఈ టూర్ జనవరి8, 15, 22, 29వ తేదీల్లో అందుబాటులో ఉంది.
- ఈ టూర్‌కు సంబంధించిన ఇతర వివరాలు, టికెట్ల బుకింగ్ కోసం ఈ లిం క్‌పై క్లిక్ చేయండి.
దుబాయ్ బుర్జ్ ఖలీఫా టూర్ - IRCTC అద్భుతమైన ప్యాకేజీ - ఇంకా మరెన్నో ప్రదేశాలు!
IRCTC "టెంపుల్ రన్" - కేరళ, తమిళనాడులో 7 రోజులపాటు దివ్యదర్శనాలు!