ETV Bharat / sports

గోల్ కీపర్@ 131 గోల్స్‌- నెట్టింట ఇప్పుడు ఇదే హాట్ టాపిక్​! - GOALKEEPER RECORD GOALS

గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పిన గోల్​కీపర్- ఎవరో తెలుసా?

Goalkeeper Record Goals
Goalkeeper Record Goals (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 3, 2025, 6:42 PM IST

Goalkeeper Record Goals : ఫుట్‌బాల్‌ గేమ్​లో గోల్స్‌ చేయడంలో అరుదైన రికార్డు నెలకొల్పిన గోల్‌ కీపర్‌ గురించి విన్నారా? ఎక్కడైనా గోల్‌ కీపర్‌ గోల్స్‌ ఆపుతాడు కానీ? చేస్తాడా? అంటారా? దాదాపు అలా జరగదు. కానీ బ్రెజిల్ గోల్ కీపర్ ‘రోసారియో సెని’ మాత్రం ప్రత్యేకం. ఫుట్‌బాల్‌ గోల్‌ కీపర్‌గా ఉంటూనే తన కెరీర్‌లో 100 కంటే ఎక్కువ గోల్స్ చేశాడు. ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. రొసారియో సెని తన కెరీర్‌లో ఫ్రీ-కిక్‌లు, పెనాల్టీల ద్వారా 131 గోల్స్ చేశాడు. కొన్ని నివేదికలు 128 గోల్స్‌ అని చెబుతున్నాయి.

రొసారియో సెని సావో పాలో ఫుట్‌బాల్ క్లబ్ తరఫున రెండు దశాబ్దాలకు పైగా (1990-2015) ఆడాడు. 2015లో 42 సంవత్సరాల వయస్సులో సావో పాలో నుంచి రిటైర్ అయ్యాడు. అతడు వాస్తవానికి గోల్ కీపర్. కోర్టులో లాస్ట్‌ డిఫెండర్‌గా, బాల్‌ గోల్‌ వెళ్లకుండా ఆపడం అతడి బాధ్యత. అయినా అతడి కెరీర్‌లో ఫ్రీ-కిక్‌ల ద్వారా 59 గోల్స్, పెనాల్టీ కిక్‌ల ద్వారా 69 గోల్స్ చేశాడు.

సెనీకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే, దాదాపు తన కెరీర్ మొత్తం ‘సావోపాలో ఫుట్‌బాల్ క్లబ్’తోనే గడిచింది. అతడు క్లబ్‌ తరఫున అత్యధికంగా 1237 మ్యాచ్‌లు ఆడాడు. బ్రెజిల్ జాతీయ జట్టు తరఫు 17 మ్యాచ్‌లు ఆడాడు. అయితే జాతీయ జట్టు తరఫున ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయాడు.

సావోపాలోతో 25 సంవత్సరాలు గడిపిన సెని, క్లబ్ కోసం అనేక ట్రోఫీలు గెలిచాడు. ఇందులో 20 మేజర్ టైటిల్స్‌ ఉన్నాయి. ఇందులో మూడు బ్రెజిలియన్ డొమెస్టిక్‌ లీగ్ టైటిల్స్‌, రెండు కోపా లిబర్టాడోర్స్, ఒక ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ఉన్నాయి. సెని 2005 ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. వ్యక్తిగతంగా గోల్డెన్ బాల్‌ అవార్డు గెలుచుకున్నాడు. సెనితో పాటు పరాగ్వే దిగ్గజ గోల్ కీపర్ లూయిస్ చిలవర్ట్ కూడా గోల్స్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. తన కెరీర్‌లో 67 గోల్స్ చేశాడు. కానీ స్కోరింగ్ పరంగా సెని కంటే చాలా వెనుకబడి ఉన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.