ETV Bharat / opinion

డింక్ కల్చర్ అంటే తెలుసా? - రాబోయే రోజుల్లో ఇదో సమస్యగా మారనుంది! - YOUTH FOLLOWING DINK LIFESTYLE

దేశంలో క్రమంగా పెరుగుతున్న డింక్ సంస్కృతి - పిల్లలను కనడానికి దంపతుల అనాసక్తి - అభిరుచులు, ఆనందం కోసం మాత్రమే డబ్బు ఖర్చు

Indian Youth Following Dink Lifestyle
Indian Youth Following Dink Lifestyle (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2025, 7:04 PM IST

Indian Youth Following Dink Lifestyle : పెళ్లికి ఆసక్తి చూపని వారే కాదు పెళ్లైనా పిల్లల్ని కనడానికీ సంకోచిస్తున్న వారూ లేకపోలేదు. భార్యభర్తలిద్దరం సంపాదిస్తాం హాయిగా జీవిస్తాం కానీ, పిల్లలు మాకొద్దు అనే వారూ ఉన్నారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వారి సంఖ్య కూడా ఏటా పెరుగుతోంది. పిల్లలు అంటే చాలు అదనపు ఖర్చు కింద ఆర్థిక భారంగా భావిస్తున్నారు. ఇదో ట్రెండ్‌గానూ మారింది. దాన్నే డింక్‌ కల్చర్‌ అంటే డ్యూయల్‌ ఇన్‌కం నో చిల్డ్రన్స్ అని గర్వంగా చెబుతున్నారు. నిజానికి ఒకప్పుడు ఇంటి నిండా పిల్లలుంటే అదో సంబరం. ఆ తర్వాత ఇద్దరు పిల్లలతో సరిపెట్టుకున్నారు. అనంతరం అది ఒకరికి పడిపోయింది. ఇప్పుడు ఏకంగా పిల్లలే వద్దంటున్నారు.

ఒకరు కూడా వద్దు అంటూ : పూర్వం అంటే తాతలనాటి కాలంలో పిల్లలు ఎంతమంది అంటే 8 లేదా 9 అంతకు మించి అనే సంఖ్య వినిపించేది. తర్వాత కుటుంబ నియంత్రణ, జనాభా రేటు అంటూ ఇద్దరు పిల్లలు ముద్దు, ముగ్గురు వద్దు అని అనేవారు. అనంతరం ఇది ఒకరికి పడిపోయింది. ఇద్దరి కంటే ఒకరే బెస్ట్ అనుకున్నారు. కాగా ఇప్పుడు ఏకంగా పిల్లలే వద్దని అనుకుంటున్నారు. దీన్నే డింక్ కల్చర్‌గా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇదో ట్రెండ్‌గానూ మారింది. పాశ్చాత్య దేశాల్లోని ఈ విధానం క్రమంగా ఇండియాకూ పాకుతోంది. డింక్ కల్చర్‌కు అట్రాక్ట్‌ అవుతున్న భార్యభర్తలు పిల్లల్ని కనడానికి ఆసక్తి చూపడం లేదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

మా వల్ల కాదంటూ : ఏంటీ డింక్‌ కల్చర్ అంటే దీని పూర్తి అర్థం (డ్యూయల్ ఇన్‌కమ్ నో కిడ్స్‌). పిల్లల కంటే తమ అవసరాలపైనే దృష్టి సారించేలా భార్యభర్తలిద్దలు తీసుకుంటున్న నిర్ణయమే డింక్‌ కల్చర్‌. అంటే భార్యభర్తలిద్దరూ తమ అవసరాల కోసం ఉద్యోగాలు చేస్తారు. కేరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటారు. అధిక ఆదాయమూ సంపాదిస్తారు. కానీ, పిల్లలు కనడంపై ఆసక్తి చూపరు. పిల్లలంటే భారంగా భావిస్తారు. పిల్లల ఆలనాపాలన మనవల్ల కాదు, పిల్లల్ని కంటే తమ ఆనందానికి అడ్డంకులు ఏర్పడతాయని అనుకుంటారు.

మన యువత కూడా : కష్టపడి సంపాదించిన సొమ్మంతా పిల్లలకే ఖర్చు చేస్తే మా జీవితం ఎక్కడుంది అనేదే డింక్‌ కల్చర్‌కు అట్రాక్ట్‌ అవుతున్న వారి అభిప్రాయం. ఒక్కముక్కలో చెప్పా లంటే భార్యభర్తలిద్దరే హాయిగా జీవించడానికి, ఆర్థికంగా బలపడేందుకు ప్రయత్నిస్తారు. కానీ, ఫ్యామిలీ అంటే పిల్లలు, భవిష్యత్‌ తరానికి వారు అవసరం. కుటుంబాల వృద్ధి, దేశాభివృద్ధిలో పిల్లలు కీలకం అనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఒకప్పుడు విదేశాల్లో ఎక్కువగా ఉండే ఈ కల్చర్ ఇప్పుడు ఇండియాకి కూడా వచ్చినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.

రిస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్లకు నచ్చినట్టు : డ్యుయెల్‌‌‌‌ ఇన్‌‌‌‌కం నో కిడ్స్‌‌‌‌ లేదా డబుల్‌‌‌‌ ఇన్‌‌‌‌కం నో కిడ్స్‌‌‌‌లను షార్ట్‌‌‌‌ ఫాంలో డింక్‌‌‌‌ అని పిలుస్తారు. ఈ ట్రెండ్‌‌‌‌ 1980ల నుంచి బాగా ప్రాచుర్యంలో ఉంది. అయితే గత ఐదారేళ్లుగా సోషల్‌‌‌‌ మీడియాలో ఇలాంటివాళ్లు వాళ్ల లైఫ్‌‌‌‌ స్టైల్‌‌‌‌ గురించి పోస్ట్‌‌‌‌లు పెడుతుండడంతో డింక్‌కి బాగా పబ్లిసిటీ పెరిగింది. పైగా ఆ పోస్ట్‌‌‌‌లు చూసి ప్రేరణ పొంది చాలామంది డింక్‌‌‌‌లుగా మారుతున్నారు. ఈ కల్చర్‌ని ఫాలో అయ్యే వారు ఖాళీ టైంని లైఫ్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌తో లేదా స్నేహితులు, కుటుంబంతో గడపడానికి ఇష్టపడతారు. నచ్చిన ప్రాంతాలు సందర్శిస్తారు. నచ్చింది తింటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా వాళ్లకు నచ్చినట్టు బతుకుతారు. వాళ్ల అభిరుచులు, ఆనందం కోసం మాత్రమే డబ్బు ఖర్చు చేస్తారు. ఇలాంటి వాళ్లు మొన్నటివరకు ఎక్కువగా ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే కనిపించేవాళ్లు. కానీ, అది క్రమంగా ప్రపంచమంతా వ్యాపిస్తోంది.

డింక్‌ కల్చర్‌కు అట్రాక్ట్‌ అవుతుండటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డింక్ కల్చర్‌ ఫాలో అయ్యే వాళ్లలో చాలామంది ఫైనాన్షియల్‌‌‌‌ ఫ్రీడం కోసమే పిల్లల్ని ఇష్టపడడం లేదని చెప్పారు. పిల్లలు ఉంటే వాళ్ల ఆరోగ్యం, చదువు కోసం చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ కాలంలో ఖర్చులు పెరిగినంత వేగంగా ఆదాయాలు పెరగడం లేదు. అందువల్ల పిల్లలు తలకు మించిన భారం అనుకుంటున్నారు.

సంపాదించించి పిల్లల కోసం ఖర్చు చేస్తే మాకేంటి అంటూ : పిల్లలు వద్దు అనుకుంటున్నవాళ్లలో దాదాపు 61 % మంది ఇదే కారణం చెప్పినట్లు అధ్యయనంలో వెల్లడైంది. వాళ్లు పిల్లల కంటే కెరీర్‌‌‌‌‌‌‌‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అమెరికాలోని బ్రూకింగ్స్ అనే సంస్థ అధ్యయనం ప్రకారం 2015లో పుట్టిన ఒక బిడ్డను 17ఏళ్ల వరకు పెంచేందుకు 3 లక్షల డాలర్లకు పైగా ఖర్చు అవుతుంది. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు బిడ్డ కోసం అంత ఖర్చు చేయలేక పిల్లల్ని కనడం లేదు. సంపాదించింది అంతా పిల్లల కోసమే ఖర్చు చేస్తే తమ పరిస్థితి ఏంటని భార్యభర్తలు భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

పెళ్లి ఎంత సహజమో, విడాకులు కూడా అంతేనా!

పెంచే అంత ఓపిక లేక : పిల్లల్ని కనడమంటే ఒక కొత్త బాధ్యతని భుజాన వేసుకున్నట్టే అని భావిస్తున్న వారు ఎక్కువవుతున్నారు. పిల్లల్ని కనగానే సరిపోదు ఆలనాపాలనా చూడాలి. క్రమశిక్షణగా పెంచాలి. పిల్లల పెంపకానికి చాలా సమయం కేటాయించాలి. సహనం కావాలి. స్కూల్‌కి తయారుచేసి పంపడం నుంచి వాళ్లు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? ఎలా చదువుతున్నారు? ఇలా అన్నీ చూసుకోవాలి అని భావిస్తున్నారు. స్కూల్‌‌‌‌ నుంచి ఇంటికి రాగానే హోం వర్క్‌‌‌‌ చేయించడం, మరుసటి రోజు టిఫిన్‌‌‌‌ బాక్స్ కట్టి స్కూల్‌‌‌‌కు పంపేవరకు ఎన్నో పనులు ఉంటాయి. అవన్నీ భార్యాభర్తలు పంచుకోవాలి. అందుకు ఇద్దరికీ చాలా టైం కావాలి. చాలా మంది ఇందుకు రెడీగా లేరు.

ఈ కాన్సెప్ట్‌ ఫాలో అయితే : కొందరికి డబ్బు సమస్య అయితే మరికొందరికి డబ్బు ఉన్నా టైం లేక పిల్లల్ని కనడం లేదు. కొన్ని సెక్టార్లలో పనిచేసే వాళ్లకు ఎక్కువ జీతంతో పాటు ఎక్కువ పనిగంటలు, ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. అలాంటి వాళ్లు పిల్లల కోసం ఎక్కువ సమయం కేటాయించలేరు. అందుకని వాళ్లు పిల్లల్ని కనేందుకు ఇష్టపడడం లేదు. పిల్లలుంటే వాళ్ల అవసరాలను తీర్చడం, ఇంటి బాధ్యతలు చూసుకోవడానికే టైం సరిపోతుంది. అదే డింక్‌‌‌‌ కాన్సెప్ట్ ఫాలో అయితే ఆ టైంని పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు, రెస్ట్ తీసుకునేందుకు వాడుకోవచ్చని చాలా మంది భావిస్తున్నారు. తమకు పిల్లలు లేకపోవడం వల్ల భార్యభర్తలిద్దరం ఒకరికోసం ఒకరం టైం ఇచ్చుకోగలం అంటున్నారు డింక్‌ కల్చర్‌ ఫాలో అయ్యేవాళ్లు.

ఇబ్బంది పడకుండా బతకొచ్చని : పిల్లలు లేకుంటే ఒత్తిడి చాలావరకు తగ్గుతుందనేది డింక్‌‌‌‌లు చెప్తున్న మాట. పిల్లల్ని బాధ్యతగా పెంచాలంటే మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు తప్పవు. దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది. అదే పిల్లలు లేకుంటే చాలా రిలాక్స్‌‌‌‌డ్ లైఫ్‌‌‌‌ని లీడ్ చేయొచ్చు. పిల్లలు లేనప్పుడు అదనంగా పనిచేయాల్సిన అవసరమే లేదు. కావాల్సినంత సంపాదించుకోవచ్చు. ఇబ్బంది పడకుండా బతకొచ్చు అని డింక్‌ కల్చర్‌ ఫాలో అయ్యే వారు భావిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం దాదాపు అందరికీ కెరీర్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ అనేది చాలా కీలకంగా మారింది. ఒక పక్క ఉద్యోగం చేస్తూనే . స్కిల్స్ అప్‌‌‌‌గ్రేడ్‌‌‌‌ చేసుకుంటేనే బెటర్ కెరీర్ ఉంటుంది. కానీ పిల్లలుంటే అంత టైం ఉండదు అని చాలా మంది అనుకుంటున్నారు. అదే పిల్లలు వద్దు అనుకున్న వాళ్లకైతే కెరీర్‌‌‌‌ మీద దృష్టి పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎక్కువ టైం ఉండడం వల్ల కెరీర్‌‌‌‌‌‌‌‌లో పెట్టుకున్న లక్ష్యాలను ఈజీగా సాధించొచ్చు. వృత్తిపరమైన అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. అందుకే పిల్లలు లేకపోతే కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఈజీగా సక్సెస్‌‌‌‌ కావొచ్చు అంటారు డింక్స్. కానీ, ఇది సమీప భవిష్యత్తులో ప్రమాదకరం కూడా కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

పిల్లలతో బాధ పడాల్సిన అవసరం లేదంటూ : పిల్లలు వద్దు అనే ధోరణి పాశ్చాత్య దేశాలలో మాత్రమే కాకుండా భారత్ వంటి దేశంలోనూ యువ జంటలను చాలా వేగంగా ఆకర్షిస్తోంది. ఈ పద్ధతి ద్వారా పిల్లల మీద పెట్టే ఖర్చుతో జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చని కొందరు అనుకుంటున్నారు. పిల్లలతో పడాల్సిన బాధలు ఏవీ ఉండవని అనుకుంటారు. ఇందుకోసం సంపాదించిన దాంట్లో కొంత భాగం వృద్ధాప్యం కోసం దాచిపెడుతున్నారు. అయితే వృద్ధాప్యంలో పిల్లలతోడు లేకుంటే ఎంత నరకంగా ఉంటుందో మాత్రం ఆలోచించడం లేదని నిపుణులు చెబుతున్నారు.

కుటుంబ వ్యవస్థలో ముఖ్యం : నిజానికి సంతానోత్పత్తి అనేది ప్రకృతి నియమం. మానవులకు, భూమిపై ఉన్న ఇతర జీవులకు విశ్వవ్యాప్తంగా ఈ రూల్ వర్తిస్తుంది. సంతానోత్పత్తి లేకుండా ఏ సమాజం దీర్ఘకాలంలో మనుగడ సాగించదు. భారతదేశంలో పిల్లలు కుటుంబ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. పిల్లల ఉనికిని కలిగి ఉండటం తల్లిదండ్రులకు మాత్రమే కాదు. అమ్మమ్మలు, తాతయ్యలు, బంధువులకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. రానురాను DINK లైఫ్‌స్టైల్ భారతదేశంలో ఎలా ఉంటుందో చూడాలని నిపుణులు అంటున్నారు.

30 దాటాక ఎంత ఆలస్యం చేస్తే అంత కష్టం! - యువతకు గైనకాలజీ డాక్టర్ల అడ్వైజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.