ETV Bharat / offbeat

ఖజురహో అందాలు, గ్వాలియర్​ రాజసం చూసిరండి - IRCTC సూపర్ టూర్! - IRCTC MAGNIFICENT MADHYA PRADESH

-మధ్యప్రదేశ్​ పర్యాటక ప్రాంతాలకోసం సూపర్ ప్యాకేజీ - ఆరు రోజుల టు ఫుల్​ ఎంజాయ్​ చేయవచ్చు

IRCTC Magnificent Madhya Pradesh Tour
IRCTC Magnificent Madhya Pradesh Tour (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2025, 2:41 PM IST

IRCTC Magnificent Madhya Pradesh Tour: దేశంలోని బెస్ట్​ టూరిస్ట్​ ప్లేస్​లలో మధ్యప్రదేశ్​ ఒకటి. చారిత్రక, ప్రపంచ వారసత్వ సంపద, ఆధ్యాత్మికత, ప్ర‌కృతి రమణీయ, వన్యప్రాణి సంరక్ష కేంద్రాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒకేసారి చూడాలంటే కొద్దిగా కష్టమే. అందుకే ఓ మూడు ముఖ్యమైన నగరాలు చూసే విధంగా ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ ఓ సూపర్​​ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఐఆర్​సీటీసీ "మాగ్నిఫిసెంట్ మధ్యప్రదేశ్(Magnificent Madhya Pradesh)"​ పేరుతో ఈ టూర్​ ఆపరేట్​ చేస్తోంది. ఈ టూర్​ 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఈ టూర్​లో గ్వాలియర్, ఖజురహో, ఓర్ఛాలోని టెంపుల్స్​, టూరిస్ట్​ ప్లేస్​లను సందర్శించవచ్చు. హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​​ జర్నీ ద్వారా ఈ టూర్​ మొదలవుతుంది.

ప్రయాణ వివరాలివే:

  • మొదటి రోజు ఉదయం హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ మొదలవుతుంది. మధ్యాహ్నానికి ఖజురహో చేరుకుని అక్కడి నుంచి హోటల్​లో చెకిన్​ అవుతారు. అనంతరం ఖజురహో లోని పలు దేవాలయాలు దర్శించుకుని తిరిగి హోటల్​కు చేరుకుని ఆ రాత్రికి అక్కడే డిన్నర్​ చేసి బస చేస్తారు.
  • రెండో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత ఖజురహోలోని మరిన్ని దేవాలయాలు దర్శించుకుంటారు. సాయంత్రం ఖజురహో డ్యాన్స్​ ఫెస్టివల్​ విజిట్​ చేస్తారు. ఆ రాత్రికి అక్కడే డిన్నర్​ చేసి స్టే చేస్తారు.
  • మూడో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత చెక్​ అవుట్​ అయ్యి ఓర్చా బయలుదేరుతారు. అక్కడి హోటల్లో చెకిన్ అయిన తర్వాత ఓర్చా ఫోర్ట్​ కాంప్లెక్స్​, దాని చుట్టుపక్కల ప్రదేశాలు విజిట్​ చేస్తారు​. అనంతరం తిరిగి హోటల్​కు చేరుకుని ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు.
  • నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత ఓర్చా నుంచి గ్వాలియర్​కు స్టార్ట్​ అవుతారు. హోటల్​లో చెకిన్​ తర్వాత గ్వాలియర్ ఫోర్ట్​, సూర్య దేవాలయం విజిట్​ చేస్తారు. ఆ రాత్రికి అక్కడే ఉంటారు.
  • ఐదో రోజు టిఫెన్​ తర్వాత చౌసత్ యోగిని ఆలయాన్ని సందర్శిస్తారు. లంచ్​ తర్వాత .. జై విలాస్ ప్యాలెస్​ను విజిట్​ చేస్తారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
  • ఆరో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ చేసి రెస్ట్​ తీసుకుంటారు. మధ్యాహ్నం తర్వాత గ్వాలియర్​ ఎయిర్​పోర్ట్​కు బయలుదేరి అక్కడి నుంచి హైదరాబాద్​కు రిటర్న్​ అవుతారు. భాగ్యనగరానికి చేరుకోవడంతో టూర్​ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు :

  • కంఫర్ట్​లో సింగిల్​ ఆక్యూపెన్సీ రూ.41,800, డబుల్​ ఆక్యూపెన్సీ రూ.34,600, ట్రిపుల్​ షేరింగ్​ రూ.33,000 ఉంది.
  • 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ. 29,850, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.26,800 గా నిర్ణయించారు.
  • 2 నుంచి 4 సంవత్సరాల చిన్నారులకు విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.21,700 పే చేయాలి.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ఫ్లైట్​ టికెట్లు
  • హోటల్‌లో వసతి
  • 5 బ్రేక్​ఫాస్ట్​, 5 డిన్నర్​, 1 లంచ్​
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • లోకల్​ ట్రాన్స్​పోర్ట్​ కోసం ప్యాకేజీని బట్టి వెహికల్
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఫిబ్రవరి 19వ తేదీన అందుబాటులో ఉంది. ​​
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

కొత్త సంవత్సరంలో జ్యోతిర్లింగాలు దర్శించుకుంటారా? - తక్కువ ధరకే IRCTC ప్యాకేజీ - ఈ ప్రదేశాలూ చూడొచ్చు!

మహా కుంభమేళాకు వెళ్తున్నారా? - తక్కువ ధరకే IRCTC టెంట్​ సిటీ - ఫోన్​లోనే ఇలా బుక్​ చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.