Daaku Maharaj Hindi : నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సినిమా 'డాకు మహారాజ్'. డైరెక్టర్ బాబీ ఈ సినిమాను తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా తెలుగులో భారీ విజయం దక్కించుకుంది. తెలుగులో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న డాకు మహారాజ్ సినిమాను జనవరి 24(శుక్రవారం)న మేకర్స్ హిందీ వెర్షన్లో రిలీజ్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. గుడ్ టాక్‌తో దూసుకెళ్తోంది.
నార్త్ నటులు ఊర్వశీ రౌతేలా, బాబీ దేఓల్ కీలక పాత్రల్లో నటించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యింది. హిందీ రిలీజ్‌కు ముందే 'డాకు మహారాజ్' నార్త్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. బాలయ్యతో యంగ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేయడం ప్రేక్షకుల్లో జోష్ నింపింది. ఈ పాట లిరికల్ వీడియో హిందీలోనూ తెగ వైరల్ అయ్యింది.
అలాగే డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య యాక్షన్ సన్నివేశాలు, తమన్ సంగీతానికి హిందీ ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు. ఇప్పటివరకు తెలుగుకే పరిమితమైన బాలయ్య, తొలి సినిమాతోనే హిందీలో ఫుల్ రెస్పాన్స్ అందుకుంటున్నారు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఫ్యూచర్లో బాలయ్య కూడా పాన్ఇండియా లెవెల్లో సినిమాలు తీయాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఉత్తరాదిలో 'డాకు మహారాజ్'కు వస్తున్న స్పందన పట్ల దర్శకుడు బాబీ కొల్లి స్పందించారు. 'డాకు మహారాజ్ హిందీ వెర్షన్‌కు ఇంత అద్భుతమైన స్పందన రావడంపై మేము చాలా సంతోషంగా ఉన్నాం. త్వరలో మిమ్మల్ని కలవడానికి ఉత్సాహంగా ఉన్నాము!' అని ఎక్స్‌లో పోస్టు చేశారు. కాగా, ఈ సినిమాను ఉత్తరాదిలో కూడా ప్రమోట్ చేసి పెద్ద సక్సెస్ సాధించాలని మేకర్స్ కూడా భావిస్తున్నారు.
We are thrilled to receive such incredible positive feedback for the Hindi version of #DaakuMaharaaj. We are truly grateful and excited to meet you very very soon! 🤩 ❤️#BlockbusterHuntingDaakuMaharaaj https://t.co/KYOB6DxpuU
— Bobby (@dirbobby) January 25, 2025
సినిమా విషయానికొస్తే, ఇప్పటికే రూ.160 కోట్లు వసూళ్లు సాధించింది. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా డైరెక్టర్ బాబీ కొల్లి తెరకెక్కించారు. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశీ రౌతేలా కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ కీలక పాత్రలో కనిపించారు. తమన్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ ఈ సినిమాను రూపొందించారు.
'డాకు మహారాజ్' సక్సెస్ ఈవెంట్ : పాటతో పాటు పవర్ఫుల్ స్పీచ్‌తో బాలయ్య సందడి
'డాకు మహారాజ్' కాసుల వర్షం- 8 రోజుల్లోనే రూ.150 కోట్లు వసూల్!