ETV Bharat / state

పిల్లలు చదుకోడానికి చక్కని చోటు - ఈ రీడింగ్ నూక్స్ - READING NOOK IDEAS FOR KIDS

పిల్లలు చదువుకోడానికి రీడింగ్ నూక్స్​ - అందుబాటులోకి వివిధ డిజైన్స్​ - కొత్తగా సెటప్స్​ కూడా వస్తున్నాయ్

Reading Nook Ideas For Kids
Reading Nook Ideas For Kids (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2025, 8:55 PM IST

Reading Nook Ideas For Kids : భోజనం చేయడానికి డైనింగ్ హాల్​, దేవుడిని ప్రార్థించడానికి పూజగది, విశ్రాంతి తీసుకోవడానికి బెడ్​రూం, మొక్కల కోసం బాల్కనీ ఇలా ఇంట్లో ఒక్కోదానికీ విడివిడిగా ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటే మరి ఏకాగ్రతగా చదువుకోవడానికి ప్రత్యేకంగా కాస్త చోటు ఉంటే బాగుటుంది కదా. సరిగ్గా మీకూ ఇదే ఆలోచనే వచ్చిందా అయితే ఈ రీడింగ్ నూక్స్​ మీద ఒక లుక్కేయండి!

Reading Nook Ideas For Kids
Reading Nook Ideas For Kids (ETV Bharat)

పిల్లలు ఇష్టపడితేనే ఏ పనైనా బాగా చేయగలరనే ఉద్దేశంతో అమ్మానాన్నలు చాలా వరకు వాళ్లకు నచ్చినట్టే ఉండేలా చూసుకుంటారు. అది తినే కంచమైనా, పడుకునే మంచమైనా. మాములుగా వాడుకునే ఈ వస్తువుల్లోనే ఇంత శ్రద్ధ చూపిస్తే చదువు విషయంలో ఇంకెంత ఆలోచిస్తారు. అందుకు పరిష్కారం చూపిస్తూనే హోంవర్కులు చేసుకోవడానికీ, ఇష్టమైనని చదువుకోవడానికీ వీలుగా రకరకాల స్టడీ టేబుళ్లూ, రీడింగ్ నూక్స్​లాంటివెన్నో అందుబాటులోకి వచ్చాయి. తక్కువ స్థలంలోనే ప్రత్యేకంగా కనిపించే ఈ రీడింగ్ నూక్స్​లో ఇప్పుడు బోలెడన్నీ వెరైటీలొచ్చి చిన్నారులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి.

ఏకాగ్రతతో చదువుకోవచ్చు : బుజ్జాయిలకు చిన్నతనం నుంచే పుస్తకాలు చదివే అలవాటు చేయాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం మంచి పుస్తకాలు కొనివ్వడమే కాదు, పిల్లలు ఓ దగ్గర ప్రశాంతంగా కూర్చుని చదువుకునేలా తగిన ఏర్పాట్లూ చేయాలి. ఉన్న చిన్న ఇంట్లోనే ఆ సౌకర్యం కావాలంటే ఈ రీడింగ్‌ నూక్స్‌ను ట్రై చేయొచ్చు. ఖాళీ సమయాల్లో నచ్చిన పుస్తకాలు చదువు కోవాలన్నా, కాలక్షేపానికి పత్రికలూ, పజిల్‌ బుక్స్‌ లాంటివి తిరగేయాలన్నా అందుకు ఇవి సరిగ్గా సరిపోతాయి. ఇంకా పరీక్షలప్పుడూ వీటిల్లో కూర్చుని ఏకాగ్రతతో చదువుకోవచ్చు. ఎన్నెన్నో ఆకారాల్లో ఆకట్టుకునే వీటి లోపల పుస్తకాలు పెట్టుకోవడానికి అరలూ, కూర్చోడానికి మెత్తటి పరుపుల్లాంటివీ అందమైన అమరికల్లో ఉంటాయి.

సెటప్స్​ కూడా దొరుకుతున్నాయి : హాల్లో కిటికీ దగ్గరో, ఇంట్లో ఓ మూలకో, రెండు గదుల మధ్య ఉన్న ఖాళీ స్థలంలోనో, మెట్ల కిందనో ఇలా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటీరియర్​కు తగ్గట్టు ఉన్న ఆ కొంచెం స్థలంలోనే చదువుకోవడానికీ, పుస్తకాలు పెట్టుకోవడానికి సరిపోయేలా తీర్చిదిద్దుకోవచ్చు. ఆహ్లాదకరంగా కనిపించడానికి నచ్చిన బొమ్మల థీముల్లో వాటికి పెయింటింగ్స్‌ వేసుకోవచ్చు. ఇలా ముందుగానే ఇంటి గోడలకు కలిపి కట్టుకోవడమేకాదు, విడిగా ఈ రీడింగ్‌ నూక్స్‌ సెటప్స్‌ కూడా దొరుకుతున్నాయి.

రకరకాల బొమ్మల ఆకారాల్లోని వీటిల్లో చిన్నారులు మెచ్చినదాన్ని తెచ్చుకుని కావాల్సిన చోట పెట్టుకోవచ్చు. ఏ మాత్రం సమయం దొరికినా- నచ్చిన పుస్తకం పట్టుకుని అందులో కూర్చుని హాయిగా చదువుకుంటూ ఊహల్లోకి వెళ్లిపోతారు. అంతేనా ఇంటికి కొత్త అందాన్ని తెచ్చిన రీడింగ్‌ నూక్స్‌ను చూసిన అతిథులూ ‘సూపర్‌ ఐడియా, మా పిల్లలకీ ఇలాంటి సెటప్‌ ఏర్పాటుచేస్తాం’ అంటూ మీ అభిరుచిని కాపీ కొట్టేసినా ఆశ్చర్యపడనక్కర్లేదు!

ఎగ్జామ్​ టైమ్​లో పుస్తకం తీయగానే నిద్ర వస్తుందా? - ఈ టిప్స్‌ వాడండి

ఎంత చదివినా అస్సలు గుర్తుండటం లేదా? - ఇలా చదివితే క్లాస్​లో ఫస్ట్​ ర్యాంక్​ మీదే!

చదివింది గుర్తుండటం లేదా? - ఈ టిప్స్‌ పాటించండి - ఇక మీరే క్లాస్ టాపర్‌!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.