ETV Bharat / sports

పాక్​పై విండీస్ సెన్సేషనల్ విక్టరీ- 35ఏళ్లలో ఇదే ఫస్ట్​టైమ్ - PAK VS WI TEST 2025

పాక్​పై విండీస్ సంచలన విజయం- 35ఏళ్లలో తొలిసారి నెగ్గిన కరీబియన్లు

PAK vs WI Test 2025
PAK vs WI Test 2025 (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 27, 2025, 2:25 PM IST

PAK vs WI Test 2025 : పాకిస్థాన్ గడ్డపై వెస్టిండీస్ చారిత్రక విజయం సాధించింది. దాదాపు 35ఏళ్ల తర్వాత పాక్​ను వారి స్వదేశంలో టెస్టు మ్యాచ్​లో ఓడించింది. ​ముల్తాన్‌ వేదికగా పాకిస్థాన్​తో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ 120 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో విండీస్ గత 35ఏళ్లలో తొలిసారి పాక్​ గడ్డపై టెస్టు విజయం రుచి చూసింది. దీనికంటే ముందు వెస్టిండీస్ 1990 నవంబర్‌లో ఫైసలాబాద్‌లో జరిగిన టెస్టులో పాకిస్థాన్‌పై నెగ్గింది. తర్వాత 1997, 2006లో పాక్‌ పర్యటనకు వెళ్లినా ఒక్క విజయం సాధించకుుండానే సిరీస్ ముగించింది. మళ్లీ ఇన్నాళ్లకు పాక్ గడ్డపై గెలిచి సంచలనం సృష్టించింది.

254 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 76/4తో మూడో రోజైన సోమవారం ఆట ప్రారంభించింది. ఈ ఇన్నింగ్స్​లో పాక్ 133 పరుగులకే ఆలౌటైంది. ఓవర్​నైట్ స్కోర్​కు కేవలం 57 పరుగులే జోడించి, చివరి 6 వికెట్లు కోల్పోయింది. బాబర్ అజామ్ (31 పరుగులు) టాప్ స్కోరర్. మహ్మద్ రిజ్వాన్ (25 పరుగులు), కమ్రాన్ గులాం (19 పరుగులు), సౌద్ షకీల్ (13 పరుగులు), సల్మాన్ ఆఘా (15 పరుగులు) పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో జోమెల్ వారికన్ 5, కెవిన్ సింక్లైర్ 3, గుడాకేష్ మోటీ 2 వికెట్లు దక్కించుకున్నారు.

విండీస్ సంచలనం
ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ నెగ్గజం అద్భుతమే అని చెప్పాలి. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో టెయిలెండర్లు గుడాకేష్‌ మోటీ (55 పరుగులు), కెమర్ రోచ్ (25 పరుగులు), వారికన్ (36 పరుగులు) పోరాట చూపించి, జట్టును ఆదుకున్నారు. దీంతో ఆ జట్టు 163 పరుగులు చేసి మళ్లీ పోటీలో నిలిచింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ 244 పరుగులు చేసింది. మరోవైపు పాకిస్థాన్ వరుసగా రెండు ఇన్నింగ్స్​ల్లో 154, 133 పరుగులు చేసింది.

కాగా, రెండు మ్యాచ్​ సిరీస్​లో తొలి మ్యాచ్​లో పాక్ నెగ్గగా, రెండో టెస్టులో వెస్టిండీస్ విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో డ్రా గా ముగిసింది.

స్పోర్ట్స్ లవర్స్​కు షాక్- ఇండియా vs పాక్ మ్యాచ్ క్యాన్సిల్- కారణం ఇదే!

వెస్టిండీస్​పై శ్రీ లంక హిస్టారిక్ విన్ - 2-1 ఆధిక్యంతో టీ20 సిరీస్‌ కైవసం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.