Building Collapse In Burari Delhi : దిల్లీలో కొత్తగా కట్టిన ఓ నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో 8ఏళ్ల బాలిక సహా ఇద్దరు మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు 12మందిని రక్షించినట్లు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. నగరంలోని బురాడీ ప్రాంతంలో ఉన్న భవనం కూలినట్లు సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో 22మంది భవనంలో ఉన్నట్లు తెలుస్తోంది.
#WATCH | Several fire tenders and Ambulances reach Delhi's Burari area where a building collapsed. Several people are feared trapped.
— ANI (@ANI) January 27, 2025
Details awaited. pic.twitter.com/YjiaYn4y3t
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సీఎంఓ నీరజ్ మీన, ఎంపీ మనోజ్ తివారీ, ఎమ్ఎల్ఏ సంజీవ్ ఝా ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు.
ఈ ప్రమాదం చాలా బాధాకరం అని దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బాధితులకు అవసరం అయిన సాయం అందిచాలని స్థానిక యంత్రాంగాన్ని ఆదేశించారు. కార్యకర్తలతో ఘటనాస్థలికి వెళ్లి అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే సంజీవ్ ఘాను ఆదేశించినట్లు ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
'ఇది కచ్చితంగా నిర్లక్ష్యమే'
ఘటనాస్థలిని పరిశీలించిన బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఈ ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణం అని అన్నారు. కొత్తగా కట్టిన భవనం కూలిపోవడం వెనుక కొందరి నిర్లక్ష్యం ఉందని, బాధ్యులను విడిచిపెట్టకూడదని డిమాండ్ చేశారు.