Telanagana TET Results : తెలంగాణలో టెట్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యా విభాగం ఉన్నత అధికారులు సంయుక్తంగా విడుదల చేశారు. టెట్ పరీక్ష రాసేందుకు 2లక్షల 75వేల 753 మంది దరఖాస్తు చేసుకోగా జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు లక్షా 35వేల 802 మంది మాత్రమే హాజరైనట్టు పాఠశాల విద్యా శాఖ పేర్కొంది. వీరిలో 42వేల 384 మంది అభ్యర్థులు అంటే కేవలం 31.21 శాతం మంది మాత్రమే అర్హత సాధించారని ప్రకటించింది. ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్లో చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. రిజల్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మొత్తం రెండు పేపర్లుగా టెట్ పరీక్షలను నిర్వహించారు. అందులో పేపర్ 1 మొత్తం 8 సెషన్లలో తెలుగు , హిందీ, ఉర్దు, కన్నడ, మరాఠీ , తమిళ్, బెంగాలీ భాషల్లో నిర్వహించారు. ఇక పేపర్ 12సెషన్లుగా 7భాషల్లో రాసేందుకు అవకాశం కల్పించారు. పరీక్ష పూర్తైన రెండు వారాల్లోనే పాఠశాల విద్యాశాఖ ఫలితాలను ప్రకటించింది.
టెట్ పరీక్షలు ప్రారంభం - కేంద్రాల వద్ద పోలీసుల బందోబస్తు
'టెట్' ఎగ్జామ్ రాస్తున్నారా? - ఈ మెలకువలు పాటిస్తే బెస్ట్ స్కోర్ మీ సొంతం!