ETV Bharat / technology

డైమండ్ షీల్డ్ గ్లాస్​తో వివో కొత్త ఫోన్- కిందపడినా కూడా ఏం కాదంట!- రిలీజ్ ఎప్పుడంటే? - VIVO V50 5G LAUNCH

అద్భుతమైన ఫీచర్లతో వివో V50 స్మార్ట్​ఫోన్- ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

Vivo V50 5G
Vivo V50 5G (Photo Credit- VIVO)
author img

By ETV Bharat Tech Team

Published : Feb 5, 2025, 7:33 PM IST

Vivo V50 5G Launch: దేశీయ మార్కెట్​లోకి వివో నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. 'వివో V50' పేరుతో కంపెనీ త్వరలో దీన్ని తీసుకురానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వివో ఈ ఫోన్ బ్యాటరీ, కెమెరా, IP రేటింగ్, డిజైన్, కలర్ ఆప్షన్​లతో పాటు కొన్ని ఫీచర్ల వివరాలను వెల్లడించింది. అయితే కంపెనీ ఈ ఫోన్ లాంఛ్ డేట్​ను మాత్రం ఇంకా ప్రకటించలేదు.

వివో ఈ అప్​కమింగ్ ఫోన్​పై ఇప్పటికే చాలా లీక్స్​ వచ్చాయి. అందులోని కొన్ని నివేదికలు ఇది ఫిబ్రవరి మూడో వారంలో లాంఛ్ అవ్వొచ్చని వెల్లడించాయి. ఈ క్రమంలో తాజాగా దీనిపై మరో నివేదిక వచ్చింది. దీని ప్రకారం ఈ ఫోన్ ఫిబ్రవరి 17న భారతదేశంలో రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.

91Mobiles నివేదిక ప్రకారం.. వివో ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 17న భారతదేశంలో విడుదల చేయనుంది. దీంతోపాటు ఈ వివో అప్​కమింగ్ ఫోన్ సేల్స్ ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా దీన్ని విక్రయించనున్నారు. అయితే ఈ ఫోన్ అధికారిక లాంఛ్​, సేల్స్​ వంటి వివరాల గురించి కంపెనీ నుంచి మాత్రం ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు.

కంపెనీ వెల్లడించిన స్పెసిఫికేషన్స్ ఇవే: ఈ ఫోన్ లాంఛ్​కు ముందుగా కంపెనీ కొన్ని స్పెసిఫికేషన్​లను వెల్లడించింది. వివో ఈ ఫోన్​లో క్వాడ్​- క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లేను అందించనుంది. ఇది 141 డిగ్రీల కర్వ్డ్​ అండ్ స్లిమ్ బెజెల్స్​తో వస్తుంది. దీంతోపాటు ఈ ఫోన్​లో డైమండ్ షీల్డ్ గ్లాస్​ను కూడా అందించనున్నట్లు వివో తెలిపింది. దీంతో ఈ ఫోన్ కిందపడిపోయినా భయపడాల్సిన అవసరం లేదని, దీని డిస్​ప్లేకు అంత ఈజీగా ఏం కాదని కంపెనీ చెబుతోంది. ఇక ఈ ఫోన్​ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీతో IP68, IP69 సర్టిఫికేషన్​తో వస్తుంది.

కలర్ ఆప్షన్స్: కంపెనీ ఈ ఫోన్​ను మూడు కలర్ ఆప్షన్​లతో రిలీజ్ చేయనుంది.

  • టైటానియం గ్రే
  • రోజ్ రెడ్
  • స్టార్రీ బ్లూ

ఇవికాకుండా కంపెనీ ఈ ఫోన్​ను 3D స్టార్​ టెక్నాలజీతో లాంఛ్ చేయొచ్చని తెలుస్తోంది. ఇది ఫోన్ వెనక భాగంలో ఉంటుంది. వివో ఈ ఫోన్ Zeiss-Opticsతో వస్తుంది. దీనిలో 50MP OIS ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఈ ఫోన్‌తో 4K వీడియో రికార్డింగ్ కూడా చేయొచ్చు. సెల్ఫీ, వీడియో కాలింగ్​ కోసం ఈ ఫోన్​లో ఫ్రంట్ కెమెరాను 50MPతో అందించొచ్చు. వీటితో పాటు ఈ ఫోన్ వెనక భాగంలో ఆరో లైట్ కూడా ఉండొచ్చు. ఇది తక్కువ వెలుతురులో కూడా మంచి ఫొటోలను తీసేందుకు ఉపయోగపడుతుంది.

ఈ ఫోన్ ఇతర ఫీచర్లు (అంచనా): కంపెనీ ఈ ఫోన్‌లో ప్రాసెసర్ కోసం స్నాప్​డ్రాగన్ 7 Gen 3 SoC చిప్‌సెట్‌ను ఉపయోగించొచ్చు. వినియోగదారులు ఈ ఫోన్‌ను 60 నెలలు అంటే 5 సంవత్సరాల పాటు సాఫీగా ఉపయోగించుకోవచ్చని వివో చెబుతోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఫన్​టచ్ OS 15 కస్టమ్ స్కిన్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌ AI ట్రాన్‌స్క్రిప్ట్, AI లైవ్ కాల్ ట్రాన్స్‌లేషన్, సర్కిల్ టు సెర్చ్, గూగుల్ జెమిని వంటి AI ఫీచర్లుతో కూడా రావొచ్చు. ఇక ఈ ఫోన్​ 6000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ టెక్నాలజీతో వస్తుందని టెక్ నిపుణుల అంచనా.

వివో V50 ధర: గతేడాది ప్రారంభించిన 'వివో V40' ప్రారంభ ధర రూ. 34,999. కంపెనీ ఇప్పుడు ఈ అప్​కమింగ్ ఫోన్​ను దీనికంటే కాస్త ఎక్కువ ధరలో రూ. 37,999కి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

గ్లోబల్ మార్కెట్​లోకి మొట్ట మొదటి ట్రై ఫోల్డ్ ఫోన్!- మరి భారత్​లో కూడా ఎంట్రీ ఇస్తుందా?

ఓలా నుంచి రెండు ఎలక్ట్రిక్ బైక్​లు- సింగిల్ ఛార్జ్​తో 501కి.మీ రేంజ్​!

అందరికీ అదే ఫోన్ కావాలట- ప్రపంచంలోనే నంబర్​ వన్​గా ఐఫోన్ 15!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.