Delhi Exit Poll Results 2025 : దిల్లీలో అధికార మార్పిడి తప్పదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈసారి భారతీయ జనతా పార్టీ-బీజేపీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 70 స్థానాలున్న దిల్లీ శాసనసభలో అధికారం చేపట్టడానికి 36 స్థానాల్లో విజయం సాధించాలి. బీజేపీ కూటమికి 51 నుంచి 60, ఆమ్‌ఆద్మీ పార్టీ 10 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. 40 నుంచి 44 స్థానాల్లో బీజేపీ కూటమి, 25 నుంచి 29 స్థానాల్లో ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్ సున్నా లేదా ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ ఇన్‌సైట్ పేర్కొంది. బీజేపీ కూటమికి 39 నుంచి 45, ఆమ్‌ఆద్మీకి 22 నుంచి 31, కాంగ్రెస్ సున్నా లేదా రెండు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని టైమ్స్ నౌ అంచనా వేసింది. 39 నుంచి 49 స్థానాల్లో బీజేపీ కూటమి, 21 నుంచి 31 స్థానాల్లో ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్ సున్నా నుంచి 1 స్థానం గెలిచే అవకాశం ఉందని పీ-మార్క్ అంచనా వేసింది.
'లేదు- ఆప్ గెలుస్తుంది!'
దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ-ఆప్ అధికారాన్ని చేపడుతుందని కేకే సర్వే అంచనా వేసింది. ఆప్ కు 44, బీజేపీ కూటమి 26 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమైతే దిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేపట్టనుంది.
Delhi Exit Poll Results 2025 :
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్(70) -2025 | ||||
|
|
|
|
|
మ్యాట్రిజ్ | 32-37 | 35-40 | 0-1 | - |
పీపుల్స్ పల్స్ | 10-19 | 51-60 | 0 | - |
పీపుల్స్ ఇన్‌సైట్ | 25-29 | 40-44 | 0-1 | - |
టైమ్స్ నౌ | 22-31 | 39-45 | 0-2 | - |
జేవీసీ పోల్ | 22-31 | 39-45 | 0-2 | 0-1 |
పోల్ డైరీ | 18-25 | 42-50 | 0-2 | - |
చాణక్య స్ట్రాటర్జీస్ | 25-28 | 39-44 | 2-3 | - |
కేకే సర్వే | 44 | 26 | - | - |