ETV Bharat / technology

ఎయిర్​టెల్ యూజర్లకు గుడ్​న్యూస్- అవే ప్రయోజనాలతో ఆ ప్లాన్​ల ధరలు తగ్గింపు- ఏకంగా రూ.110! - AIRTEL CALLING PLAN PRICE REDUCE

వాయిస్, SMS ప్లాన్​ల ధరలను మరోసారి సవరించిన ఎయిర్​టెల్- కారణం ఇదేనా?

Airtel Has Reduced the Price of New Calling Plans
Airtel Has Reduced the Price of New Calling Plans (Photo Credit- AIRTEL)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 26, 2025, 7:59 PM IST

Airtel Calling Plan Price Reduce: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ కొత్తగా తీసుకొచ్చిన వాయిస్ కాలింగ్, SMS ఓన్లీ ప్లాన్​ల ధరలను మరోసారి సవరించింది. ఇటీవల తీసుకొచ్చిన రెండు ప్లాన్​ల ప్రయోజనాలను అలాగే ఉంచుతూ ధరలను మార్చుతూ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్​లను ప్రారంభించిన రెండు రోజుల్లోనే కంపెనీ వీటిని సవరించడం గమనార్హం.

భారతీ ఎయిర్‌టెల్ జనవరి 23, 2025న వాయిస్ కాలింగ్, SMS కోసం మాత్రమే రూ.499, రూ.1959లతో రెండు కొత్త ప్లాన్​లను ప్రారంభించింది. అయితే రెండు రోజుల్లోనే వీటి ధరలను వరుసగా రూ.469, రూ.1849గా మార్చింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ ఈ కొత్త ప్లాన్​ల ధరలను కేవలం రెండు రోజుల్లోనే ఎందుకు తగ్గించిందో తెలుసుకుందాం రండి.

ఇంతకు ముందు టెలికాం కంపెనీలు అందించే రీఛార్జ్ ప్లాన్​లలో డేటా సదుపాయం కూడా ఉండేది. అయితే ఇంటర్నెట్ అవసరం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగదారులు రీఛార్జి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వాయిస్‌, SMSల కోసం ప్రత్యేకంగా రీఛార్జి ప్లాన్లు తీసుకురావాలని ఆయా కంపెనీలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆదేశించింది. ఈ క్రమంలో స్పెషల్‌ టారిఫ్‌ వోచర్లు తీసుకురావాలంటూ సూచించింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌తో పాటు, జియో, VI కూడా మూడు రోజుల క్రితం తమ కొత్త కాలింగ్, SMS ఓన్లీ ప్లాన్‌లను ప్రారంభించాయి.

ఎయిర్‌టెల్ తన పాత రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్‌ను నిలిపివేసి రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఇంతకు ముందు రూ. 509 ప్లాన్‌లో అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, మొత్తం 6GB డేటాతో పాటు ఎక్స్‌ట్రీమ్ యాప్‌ల ప్రయోజనాలను అందించింది. అయితే ఆ తర్వాత ఈ ప్లాన్ స్థానంలో కంపెనీ రూ.10 తక్కువకు అంటే రూ.499కి కాలింగ్, SMS ఓన్లీ ప్లాన్‌ను ప్రారంభించింది. దీనిలో వినియోగదారులకు అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 900 SMSల సౌకర్యం మాత్రమే అందించింది.

ఇక రూ.1999తో ఉన్న పాత ప్లాన్‌ను తొలగించి రూ.1959 కొత్త కాలింగ్ ఓన్లీ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇంతకుముందు రూ.1999 ప్లాన్‌లో అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలు, మొత్తం 24GB డేటాతో పాటు ఎక్స్‌ట్రీమ్ యాప్‌ల ప్రయోజనాలను అందించింది. అయితే ఇటీవలే ఈ ప్లాన్ స్థానంలో కంపెనీ కేవలం రూ.40 తక్కువకు అంటే రూ.1,959కి కాలింగ్ ప్లాన్‌ను ప్రారంభించింది. దీనిలో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్​తో పాటు 3,600 SMSల సౌకర్యం మాత్రమే అందించింది.

అంటే ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన ఈ రెండు కొత్త కాలింగ్ ప్లాన్స్​లో వినియోగదారలకు నష్టాన్నే కలిగిస్తున్నాయి. ఎందుకంటే వారి పాత ​రూ. 509 ప్లాన్​లోని 6GB డేటా, ఎక్స్‌ట్రీమ్ యాప్‌ల ప్రయోజనాలను తీసేసి ధరను కేవలం రూ. 10 మాత్రమే తగ్గించింది. అంతేకాక 8400 SMSలకు బదులుగా 900 SMSల సౌకర్యం మాత్రమే అందించింది.

అదేవిధంగా ఎయిర్​టెల్ పాత రూ.1999 ప్లాన్​లో 24GB డేటా, ఎక్స్‌ట్రీమ్ యాప్‌ల ప్రయోజనాలను తొలగించి కేవలం రూ.40 మాత్రమే తగ్గించింది. దీంతోపాటు మొత్తం 36,500 SMSలకు బదులుగా కేవలం 3,600 SMSల సౌకర్యం మాత్రమే అందించింది. ఈ కారణంగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, VI లను కొత్తగా ప్రారంభించిన వాయిస్ కాలింగ్ ప్లాన్‌ల ధరను తగ్గించాలని ఆదేశించినట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదిక వెల్లడించింది.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎయిర్‌టెల్ తన వెబ్‌సైట్‌లో కొత్తగా ప్రారంభించిన రూ.499, రూ.1959 కాలింగ్ ప్లాన్‌ల ధరలను మరోసారి సవరించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎయిర్​టెల్ ఇప్పుడు ఈ ప్లాన్​ల ధరలు వరుసగా రూ.469, రూ.1849కి తగ్గించింది. అంటే కంపెనీ ఈ రెండు కొత్త ప్లాన్‌ల ధరను వరుసగా రూ.30, రూ.110 తగ్గించింది.

మరోసారి ధరలను సవరించిన తర్వాత ఎయిర్​టెల్ కొత్త ప్లాన్​ల వివరాలు:

  • రూ.469 ప్రీపెయిడ్ ప్లాన్‌: ఈ ప్లాన్‌లో వినియోగదారులు అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోమింగ్, 84 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 900 SMSలను పొందుతారు.
  • 1849 ప్లాన్‌: ఈ రీఛార్జ్​ ప్లాన్​ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్​తో వినియోగదారులు అన్​లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోమింగ్​తో పాటు 3600 SMS సౌకర్యం లభిస్తుంది.

పైన తెలిపిన సదుపాయాలతో పాటు ఈ రెండు ప్లాన్‌లతో వినియోగదారులు అపోలో 24/7 సర్కిల్ మెంబర్​షిప్, 3 నెలల పాటు ఉచిత హలో ట్యూన్‌లను కూడా పొందుతారు. ఇవి చాలా ఎయిర్‌టెల్ ప్లాన్‌లతో అందుబాటులో ఉన్నాయి.

రాయల్​ ఎన్​ఫీల్డ్ డిమాండ్ లేదుగా- ఏకంగా 5లక్షల మంది కొన్న మోడల్ ఇదే!​

గ్లోబల్ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్- చౌక ధరకు ఎక్కడ లభిస్తాయంటే?

కొత్త కారు కొనాలా?- అయితే వెంటనే త్వరపడండి- ఆలస్యం చేస్తే ఇక బాదుడే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.