ETV Bharat / state

ఆ కూలీలకూ 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' అందించండి : హైకోర్టు - TG HC IN INDIRAMMA RYTHU BHAROSA

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై ప్రజాప్రయోజన వాజ్యం - దాఖలు చేసిన నారాయణపేట వాసి - పురపాలిక రైతు కూలీలకూ పథకం వర్తింపజేయాలంటూ పిటిషన్

Telangana High Court On Indiramma Athmiya Bharosa
Telangana High Court On Indiramma Athmiya Bharosa (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2025, 12:38 PM IST

Telangana High Court On Indiramma Athmiya Bharosa : తెలంగాణ హైకోర్టులో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. పురపాలికాల్లో ఉన్న రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం డబ్బులు ఇవ్వడం లేదని నారాయణపేట వాసి గవినోళ్ల శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు చెల్లించేలా పథకం రూపొందించిన ప్రభుత్వం, పురపాలికల్లో ఉంటున్న రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపారు. 129 పురపాలికల్లో 8 లక్షల మందికి పైగా రైతు కూలీలున్నారని చెప్పారు.

పిటిషన్ తరఫున న్యాయవాది మాట్లాడుతూ రైతు కూలీలు ఎక్కడ ఉన్నా అందరూ సమానమేనని, గ్రామాల్లో వారికే వర్తింపజేయడం సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం అన్నారు. అనంతరం హైకోర్టు స్పందిస్తూ, నాలుగు వారాల్లో మున్సిపాలిటీల్లోని రైతు కూలీలను ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలోకి తీసుకోవాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది.

కాగా జనవరి 26న రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసింది. వారితో పాటు భూమిలేని రైతు కూలీల ఖాతాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నగదును బదిలీ చేసింది. వారు సోమవారం నుంచి వాటిని తీసి వాడుకోవచ్చు. అయితే ఇందరమ్మ ఆత్మీయ భరోసా కేవలం గ్రామాల్లో ఉన్న రైతులకే వర్తిస్తుందని, మున్సిపాలిటీల్లో ఉంటున్న రైతు కూలీలకు వర్తించకపోవడంతో దానిపై ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది.

'రైతు భరోసా' డబ్బులు ఈరోజు రావు - ఖాతాల్లోకి నగదు బదిలీ ఎప్పుడంటే?

ప్రభుత్వం గుడ్​న్యూస్ - ఇక నుంచి వారికీ రైతు భరోసా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.