Hyderabad to Srisailam Tour : ఈ ప్రపంచం అందమైన పుస్తకం. అందులో మనకు వీలైనన్ని ఎక్కువ పేజీలు చదవాలి. అలా చదవాలంటే వీలైనన్ని కొత్త ప్రాంతాలను చూడాలి. టూర్లకు వెళ్లి రావాలి. ఇలా చేయడం ద్వారా కొత్త ప్రాంతాలను చూసిన అనుభూతి పొందడం మాత్రమే కాకుండా, రొటీన్ వర్క్ నుంచి రిలీఫ్ కూడా పొందవచ్చు. ఇలాంటి వాళ్లకోసమే తెలంగాణ టూరిజం శ్రీశైలం ప్యాకేజ్ ఆపరేట్ చేస్తోంది. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
శ్రీశైలం టూర్‌కు రెండు బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఏసీ బస్సు, మరొకటి నాన్-ఏసీ బస్సు. వాటి టికెట్ ధరలు ఇలా ఉన్నాయి.
AC బస్సు ప్యాకేజీ ఇలా :
పెద్దలకు ఛార్జీ = Rs.2,990
పిల్లలకు ఛార్జీ = Rs.2392
శ్రీశైలంలో వసతి నాన్ ఏసీలో ఉంటుంది.
నాన్ AC బస్సు ప్యాకేజీ ఇలా :
పెద్దలకు ఛార్జీ = Rs.2,000
పిల్లలకు ఛార్జీ = పిల్లలకు Rs.1,600
శ్రీశైలంలో వసతి నాన్ ఏసీలో ఉంటుంది.
టూర్ మొదలయ్యేది ఇలా :
- హైదరాబాద్‌లోని పర్యాటక్ భవన్ నుండి ఉదయం 8:30 గంటలకు బస్సు బయలుదేరుతుంది.
- CRO బషీర్‌బాగ్ వద్ద ఆగి, అక్కడ ఉన్న ప్రయాణికులను కూడా ఎక్కించుకొని, ఉదయం 09.00 గంటలకు బయల్దేరుతుంది. మార్గం మధ్యలో మధ్యాహ్న భోజనం కోసం ఆగుతుంది.
- సాయంత్రం 5:00 గంటలకు శ్రీశైలం చేరుకుంటారు. మార్గం మధ్యలోనే సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకొని, ఆ తర్వాత నేరుగా హోటల్‌కు తీసుకెళ్తారు.
- శ్రీశైలం హోటల్‌లో ప్రత్యేకంగా దుప్పట్లు ఏమీ ఇవ్వరు. పర్యాటకులు సొంత దుప్పట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
- శ్రీశైల దర్శనం అదేరోజు సాయంత్రం లేదా తెల్లవారు జామున చేసుకోవాలి. అది టూరిస్టు ఇష్టానుసారం ఉంటుంది.
2వ రోజు ఇలా :
- మరుసటి రోజు ఉదయం హోటల్ లోనే అల్పాహారం చేసిన తర్వాత బయలుదేరి, రోప్ వే (పాతాళ-గంగ) సందర్శనకు వెళ్తారు. అక్కడి నుంచి ఫలధార, ఆ తర్వాత పంచధార, అటు నుంచి శిఖరం, చివరగా ప్రతిష్ఠాత్మకమైన శ్రీశైలం డ్యామ్ ను సందర్శిస్తారు.
- సందర్శన పూర్తయిన తర్వాత తిరిగి హైదరాబాద్ ప్రయాణం మొదలవుతుంది. రాత్రి 7:00 గంటల వరకు నగరానికి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
గమనిక: ఈ టూర్ ప్యాకేజీలో బస్సు ఛార్జీలు, వసతి మాత్రమే కవర్ అవుతాయి. అక్కడ భోజనం, టెంపుల్ దర్శనం, ఇతర ప్రాంతాల్లో టికెట్ల ఖర్చులు ఏవైనా ఉంటే అవి పర్యాటకులే భరించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
ఒకే ట్రిప్‌లో యాదాద్రి, భద్రకాళి టెంపుల్, రామప్ప దర్శనం - తక్కువ ధరకే తెలంగాణ టూరిజం ప్యాకేజీ
హైదరాబాద్ నుంచి కొత్త పర్యాటక ప్యాకేజీలు - ఉదయం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చేలా ప్లాన్!