ETV Bharat / offbeat

"సున్నుండలు" నోటికి అంటుకోకుండా - పప్పులో ఇదొక్కటి కలిపితే చాలు! - టేస్ట్ బోనస్! - SUNNUNDALU RECIPE

నోరూరించే కమ్మని "సున్నుండలు" - ఒకటికి రెండు తింటారు!

How to Make Sunnundalu
Sunnundalu Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2025, 3:43 PM IST

Sunnundalu Recipe in Telugu : ఎక్కువ మంది ఇష్టపడే సంప్రదాయ స్వీట్ రెసిపీలలో ఒకటి సున్నుండలు. వీటిని వివిధ రకరకాలుగా ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, చాలా మందికి సున్నుండలు అంత పర్ఫెక్ట్​గా కుదరవు. అంతేకాకుండా ఇవి తినేటప్పుడు నోటికి అంటుకుంటూ పంటికి జిగురుగా తగులుతుంటాయి. ఓసారి ఈ టిప్స్ ఫాలో అవుతూ "సున్నుండలు" ప్రిపేర్ చేసుకోండి. తినేటప్పుడు నోటికి అంటుకోకుండా పర్ఫెక్ట్ టేస్ట్​తో చక్కగా కుదురుతాయి. పైగా వీటి తయారీకి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు! ఎవరైనా చాలా సింపుల్​గా ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, ఈ సూపర్ టేస్టీ లడ్డూల తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • మినప్పప్పు - 2 కప్పులు
  • పొట్టు మినప్పప్పు - 1 కప్పులు
  • బియ్యం - 2 టేబుల్​స్పూన్లు
  • యాలకులు - 6
  • బెల్లం తురుము - 2 కప్పులు
  • నెయ్యి - తగినంత

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టౌపై పాన్ పెట్టుకొని మామూలు మినప్పప్పు, పొట్టు మినప్పప్పు రెండింటిని వేసుకొని లో ఫ్లేమ్ మీద పప్పు రంగు మారి, మంచి సువాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి.
  • అలా వేయించుకునేటప్పుడే మధ్యలో బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇలా బియ్యాన్ని యాడ్ చేసుకోవడం ద్వారా సున్నండలు మనం తినేటప్పుడు నోటికి అంటుకోకుండా సూపర్ టేస్టీగా వస్తాయి.
  • ఆ విధంగా వేయించుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్​లోకి తీసుకొని చల్లార్చుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన మినప్పప్పు మిశ్రమం, యాలకులు వేసుకొని మెత్తని పౌడర్​లా మిక్సీ పట్టుకోవాలి.
  • ఆ తర్వాత అందులో బెల్లం తురుము వేసుకొని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కప్పు మినప్పప్పుకి 1 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి.
  • ఆవిధంగా మిక్సీ పట్టుకున్నాక ఆ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి ప్లేట్​(బేషన్​)లో వేసుకొని చేతితో ఒకసారి రబ్ చేస్తూ పిండి మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం ద్వారా పిండిలో ఏమైనా చిన్న చిన్న బెల్లం ఉండలు ఉంటే కలిసిపోతాయి.
  • ఇప్పుడు కలిపిపెట్టుకున్న పిండిలో ముందుగానే కాచి చల్లార్చుకున్న నెయ్యిని కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలా చేసుకోవడానికి వీలుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి.
  • అలా మిక్స్ చేసుకున్నాక కొద్దికొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ ఉండలుగా చుట్టుకోవాలి. అంతే, సూపర్ టేస్టీ "సున్నండలు" రెడీ!
  • ఈ లడ్డూ మంచి బలమైన ఫుడ్ అని చెప్పుకోవచ్చు. పిల్లలతో పాటు పెద్దలు డైలీ ఒక సున్నుండ తిన్నారంటే శరీరానికి కావాల్సిన పోషకాలు అంది హెల్దీగా ఉంటారంటున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

చలికాలంలో మోకాళ్లు, కీళ్ల నొప్పులను తగ్గించే సూపర్​ లడ్డూ - ఇలా చేసుకుంటే టేస్ట్​ అదుర్స్​!

"మోతిచూర్​ లడ్డూ" - ఈ టెక్నిక్​ తెలిస్తే బూందీ గరిటెతో పనేలేదు - టేస్ట్​లో నో కాంప్రమైజ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.