Delhi Polls AAP Manifesto : దిల్లీ ప్రజలపై ఆమ్ అద్మీ పార్టీ ఉచితాల వర్షం కురిపించింది. ఈ మేరకు సోమవారం 'కేజ్రీవాల్ కి గ్యారంటీ' పేరుతో 15 హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విడుదల చేశారు. ఉద్యోగాల కల్పన, మహిళా సమ్మాన్ యోజన, సంజీవని పథకం తదితర హామీలు ఇందులో ఉన్నాయి. వృద్ధులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పతుల్లో ఉచిత వైద్యం, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. వీటితో పాటు పలు సంక్షేమ పథకాలను కొనసాగిస్తామన్నారు. మెట్రో ఛార్జీల్లో 50శాతం రాయితీ ఇస్తామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో వీటన్నింటిని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. తమ పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
#WATCH | AAP National Convenor Arvind Kejriwal announces his party's poll guarantees for #DelhiElections2025
— ANI (@ANI) January 27, 2025
He says, " today, we are announcing 15 'kejriwal ki guarantees' which will be fulfilled in the next 5 years. first, guarantee is of employment. second guarantee - mahila… pic.twitter.com/hnk4dbwLLX
కేజ్రీవాల్ గ్యారెంటీలు ఇవే!
- అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగాల కల్పన
- మహిళా సమ్మాన్ యోజన పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2,100 ఆర్థిక సాయం
- సంజీవని పథకం కింద 60 ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులో ఉచిత వైద్యం
- నీటి సరఫరా బిల్లులు మాఫీ
- 24 గంటల నీటి సరఫరా
- యూరప్‌లో మాదిరిగా రోడ్ల నిర్మాణం
- యమునా నది శుభ్రం చేయడం
- డా.అంబేడ్కర్ స్కాలర్‌షిప్ స్కీమ్ కింద విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, దిల్లీ మెట్రో ప్రయాణంలో 50 శాతం రాయితీ
- పూజారులు, గ్రంథీలు ఒక్కొక్కరికి రూ.18 వేలు
- అద్దెదారులకు ఉచిత కరెంటుతో పాటు ఉచిత నీటి సౌకర్యం, మురుగు నీటి వ్యవస్థను పరిష్కరించడం, రేషన్ కార్డులు మంజూరుచేయడం
- ఆటో, టాక్సీ, ఈ-రిక్షా డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ.1లక్ష అందజేత, వారి పిల్లలకు ఉచిత కోచింగ్, జీవిత బీమా
- రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్ల్యూఏ)లకు ప్రైవేటు గార్డులను ఆప్ అందించనుంది.
ఆప్ 'మిడిల్ క్లాస్ మేనిఫెస్టో'
ఇటీవల దిల్లీలోని మధ్యతరగతి ప్రజల కోసం ఆప్ 7 పాయింట్ల మేనిఫెస్టో విడుదల చేసింది. భారత ఆర్థిక వ్యవస్థకు సిసలైన సూపర్ పవర్ లాంటి మధ్యతరగతి ప్రజానీకాన్ని కేంద్రంలోని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయంటూ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆప్ మేనిఫెస్టోలో ఉన్న ఏడు డిమాండ్ల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.