ETV Bharat / sports

టీ20 ర్యాంకింగ్స్​లో నెంబర్‌ 2 పొజిషన్​కు SRH బ్యాటర్ - టాప్​ 10లో ముగ్గురు భారత ప్లేయర్ల హవా! - ICC T20 RANKINGS

ఇంగ్లాండ్‌పై విధ్వంసకర బ్యాటింగ్​ - ఐసీసీ ర్యాంకుల్లో నెంబర్‌ 2 పొజిషన్​కు అభిషేక్, టాప్​ 10లో మరో ముగ్గురు భారత్ ప్లేయర్లు కూడా

ICC T20 Rankings
Abhishek Sharma ICC T20 Rankings (Associates Press)
author img

By ETV Bharat Sports Team

Published : Feb 5, 2025, 3:56 PM IST

ICC T20 Rankings : ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్​లో అదరగొట్టిన సన్​రైజర్స్ హైదరాబాద్​ క్రికెటర్ అభిషేక్ శర్మ తాజాగా విడుదలైన ఐసీసీ ర్యాంకుల్లోనూ దూసుకెళ్లాడు. ఏకంగా 38 స్థానాలు ఎగబాకి రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. తాజాగా జరిగిన ఐదో టీ20లో సెంచరీ సాధించిన ఈ యంగ్ ప్లేయర్​, 829 పాయింట్లతో ఈ ర్యాంక్​కు చేరుకున్నాడు. అయితే టాప్ పొజిషన్​లో మాత్రం 855 పాయింట్లతో ఆసీస్‌ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కొనసాగుతున్నాడు. ఇక తర్వాతి స్థానాల్లో తిలక్‌ వర్మ (803 పాయింట్లు), ఫిల్ సాల్ట్ (798), సూర్యకుమార్‌ యాదవ్ (738) ఉన్నారు.

అభిషేక్​తో పాటు అతడు కూడా
ఇదిలా ఉండగా, తాజాగా 'ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా' నిలిచిన బౌలర్ వరుణ్‌ చక్రవర్తి కూడా ఐసీసీ ర్యాంకుల్లో టాప్ పొజిషన్​కు చేరుకున్నాడు. మూడు స్థానాలను మెరుగుపరుచుకుని మూడో ర్యాంక్‌ను సాధించాడు. అయితే ఈ లిస్ట్​లో వెస్టిండీస్​ బౌలర్ అకీల్ హుసేన్ (707 పాయింట్లు) అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఇక అదిల్ రషీద్ (705), వరుణ్‌ చక్రవర్తి (705) పాయింట్ల పరంగా ఒకే పొజిషన్​లో ఉన్నప్పటికీ, కొద్దిపాటి తేడాతో రషీద్ రెండు స్థానంలో నిలిచాడు. ఇక 671 పాయింట్లను సాధించిన యంగ్ క్రికెటర్​ రవి బిష్ణోయ్ ఈ ర్యాంకింగ్స్​లో నాలుగు ర్యాంకులను ఎగబాకి ఆరో ప్లేస్‌కు చేరుకున్నాడు.

బుమ్రాదే టాప్​ పొజిషన్​
మరోవైపు టెస్టుల్లోనూ బ్యాటింగ్‌, బౌలింగ్‌ ర్యాంకులను తాజాగా ఐసీసీ అప్‌డేట్ చేసింది. ఈ క్రమంలో బౌలింగ్‌ విభాగంలో భారత స్టార్ బౌలర్​ జస్‌ప్రీత్ బుమ్రా (908) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఈ సారి టాప్‌ -10లో బుమ్రతో పాటు రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు. 745 పాయింట్లతో జడ్డూ తొమ్మిదో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.

ఇక బ్యాటర్ల విషయానికొస్తే, ఇంగ్లాండ్​ స్టార్ క్రికెటర్ జో రూట్ 895 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే ఈ సారి టాప్‌ -10లో కేవలం ఇద్దరు టీమ్​ఇండియా బ్యాటర్లు మాత్రమే ఉండటం గమనార్హం. యశస్వి జైస్వాల్ 847 పాయింట్లతో నాలుగో ప్లేస్​ను సాధించగా, 739 పాయింట్లతో రిషభ్ పంత్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు.

షేక్ ఆడించిన అభిషేక్​ - సూపర్ సెంచరీ - ఆ ఘనత సాధించిన రెండో ప్లేయర్​గా రికార్డ్

హాఫ్ సెంచరీ తర్వాత అభిషేక్​ స్పెషల్ గెస్చర్​ - 'అలా చేయడానికి వాళ్లే కారణం - ఆ ఇద్దరి కోసమే అదంతా!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.