Delhi Polls BJP Manifesto : దిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే మూడేళ్లలో యమునా నదిని శుద్ధి చేస్తామని కేంద్ర హోమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. దిల్లీలోని 1700 అనధికార కాలనీలలోని ప్రజలకు పూర్తి యాజమాన్య హక్కులను అందిస్తామని చెప్పారు. గిగ్ వర్కర్లకు, కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపడతామని అన్నారు. 'సంకల్ప పత్ర పార్ట్-3' పేరుతో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ చివరి మేనిఫెస్టోను అమిత్‌షా విడుదల చేశారు.
VIDEO | Union Home Minister Amit Shah (@AmitShah) releases BJP's final part of 'Sankalp Patra' for the upcoming Delhi Assembly Election. #DelhiElectionsWithPTI
— Press Trust of India (@PTI_News) January 25, 2025
(Full video available on PTI Videos: https://t.co/n147TvrpG7) pic.twitter.com/EOUXA9tKAa
వరాల జల్లు
జాతీయ కామన్ మొబిలిటీ కార్డు కింద ఏడాదికి రూ.4వేల ఖర్చు వరకు దిల్లో మెట్రోలో విద్యార్థులు ఉచితంగా ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పిస్తామని అమిత్ షా అన్నారు. దిల్లీలో ఖాళీగా ఉన్న 50 వేల ప్రభుత్వ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తామని, 20 లక్షల స్వయం ఉపాధి అవకాశాలను సృష్టిస్తామని చెప్పారు. గ్రాండ్ మహాభారత్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. బీజేపీ అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలో చర్చించి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో యుమునా నదిని పూర్తిగా శుభ్రం చేయిస్తామని, గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 1,700 అనధికార కాలనీలలో కొనుగోలు, అమ్మకంతో పాటు నిర్మాణం ఇలా పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తామని అమిత్ షా తెలిపారు. రూ.10 లక్షల ఆరోగ్య బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా అందిస్తామని హామీ ఇచ్చారు.
#WATCH | #DelhiElections2025 | Union Home Minister Amit Shah says, " arvind kejriwal is running a government in delhi which does not fulfil its promises and then again he comes forward with a heap of lies and an innocent face. in my political career, i have never seen such a liar.… pic.twitter.com/RNAhZ9XpdD
— ANI (@ANI) January 25, 2025
ఆప్ ఏమీ చేయలేదు!
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అబద్ధాలు చెప్పేవారిని, మోసగాళ్లను సాగనంపే ఎన్నికలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దిల్లీలో అమలులో ఉన్న అన్ని సంక్షేమ ప్రథకాలను కొనసాగిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. దిల్లీలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం రూ.41,000 కోట్లు, రైల్వే లైన్లు వేయడానికి రూ.15,000 కోట్లు, విమానాశ్రయాలకు రూ.21,000 కోట్లు ఖర్చు చేసిందని షా అన్నారు. కేజ్రీవాల్ హయాంలో దిల్లీలో ఎన్నడూ లేనంత స్థాయిలో అవినీతి పెరిగిందని ఆరోపించారు. లండన్‌లోని థేమ్స్ నదిలా యమునా నదిని మారుస్తానని కేజ్రీవాల్ చెప్పారన్నారు. అందులో మునిగి తెలుతానన్న కేజ్రీవాల్ హామీ ఏమైందంటూ అమిత్ షా విమర్శించారు.
#WATCH | #DelhiElections2025 | Union Home Minister Amit Shah says, " to promote tourism, mahabharat corridor will be constructed with the cooperation of haryana and up governments. in line with the sabarmati river front, the yamuna river front will be constructed. i invite arvind… pic.twitter.com/M2p9vVswjk
— ANI (@ANI) January 25, 2025
ఫిబ్రవరి 5న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆప్, బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా యత్నిస్తున్నాయి.