LPG Gas Cylinder Safety Precautions: ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను తప్పక వాడుతుంటారు. ఇది ఎంత ఉపయోగకరమో.. అజాగ్రత్తగా వ్యవహరిస్తే అంతే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ సిలిండర్లను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల భారీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిలిండర్ ఉపయోగించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- గ్యాస్ సిలిండర్‌ను ఎప్పుడూ నిలువుగానే ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డంగా పడుకోబెట్టకూడదని సూచిస్తున్నారు.
- ఇంకా స్టవ్‌ను సిలిండర్ కంటే ఎత్తులో ఉంచి వంట చేయాలి.
- గ్యాస్‌ను ఆన్ చేయడం, అగ్గి పుల్ల గీయడం లేదా లైటర్ అంటిచడం ఒకేసారి చేయాలి. ఆన్ చేశాక అగ్గి పుల్లని గీయకూడదు.
- గ్యాస్ పైపులకు ఎలాంటి జాయింట్లు ఉండకూడదు. ఇంకా ఒక కనెక్షన్‌కు ఒక స్టవ్‌ను మాత్రమే వినియోగించాలి.
- సిగరెట్లు, దీపాలు, కిరోసిన్ స్టవ్‌లు, లాంతర్లను సిలిండర్‌కు దూరంగా ఉంచాలి.
- సిలిండర్ వినియోగించకపోతే గ్యాస్ ఉన్నా లేకున్నా.. మూత బిగించే ఉంచాలి. వినియోగిస్తున్నట్లైతే పని పూర్తవ్వగానే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి.
- ముఖ్యంగా బయటకు వెళ్తున్నప్పుడు, రాత్రి పడుకునే ముందు గ్యాస్ ఆఫ్ చేశామో లేదో ఓసారి చెక్ చేసుకుంటే మంచిది.
- గ్యాస్ ట్యూబ్లు కంపెనీవి మాత్రమే వినియోగించాలి. వీటిని 4-5 ఏళ్లకు ఒకసారి తప్పనిసరిగా మార్చాలి.
- వంట చేస్తున్న సమయంలో నూలు వస్త్రాలు, కాటన్ యాప్రాన్లనే ధరించాలి. ముఖ్యంగా స్టవ్ ఆన్‌లో ఉంచి ఇతర పనులు చేయకూడదు.
- స్టవ్ లేదా కనెక్షన్ సమస్య వస్తే సొంతంగా రిపేర్ చేయకూడదు. సంబంధిత నిపుణులతో మాత్రమే రిపేర్ చేయించాలి.
- ఇంకా మీకు సిలిండర్‌ను సరిగా అమర్చటం రాకుంటే సర్వీస్ మ్యాన్ లేదా డెలివరీ పర్సన్ సహాయం తీసుకోవాలి.
- సిలిండర్‌ను గాలి, వెలుతురు బాగా తగిలే ప్రదేశంలోనే పెట్టాలి. ఒకవేళ కిచెన్ కబోర్డ్‌లో ఉంచితే డోర్ దిగువ, పై భాగాల్లో వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి.
- ఇంకా డెలివరీ సమయంలో గ్యాస్ సిలిండర్ సీల్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
- పిల్లలను ఎప్పుడూ వంటగదికి, ఎల్పీజీ సిలిండర్‌కు దూరంగా ఉండేలా చూసుకోవాలి.
- ఒకవేళ ప్రమాదవశాత్తూ గ్యాస్ లీక్ అయినట్లయితే కిటికీలను తెరచి, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వెంటనే LPG సప్లయర్ లేదా ఎమర్జెన్సీ సర్వీసులను సంప్రదించాలని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అర్ధరాత్రి మెలకువ వస్తుందా? నైట్ హాయిగా నిద్రపోవాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలట!
మీ కార్ అద్దంపై మరకలా? ఇంట్లోని గ్లాసులు మురికిగా మారాయా? ఈ టిప్స్ పాటిస్తే క్లీన్ అవుతుందట!