ETV Bharat / offbeat

వైజాగ్​ to అండమాన్​ - IRCTC స్పెషల్​ ప్యాకేజీ - బీచ్​లో ఫుల్​ చిల్​ అవ్వొచ్చు బాస్​!

- పర్యాటకులకు ఐఆర్​సీటీసీ అద్భుత ఆఫర్ - అండమాన్​ వెళ్లేందుకు సూపర్ ప్యాకేజీ

IRCTC Tour
IRCTC Tour (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2024, 12:03 PM IST

IRCTC LTC Special Andaman Emeralds Ex-Vishakhapatnam: దేశంలోనే అత్యంత అందమైన పర్యాటక ప్రాంతాల్లో అండమాన్ నికోబార్ దీవులు ఒకటి. ఇసుక తిన్నెలతో ఆహ్లాదకరంగా కనిపించే బీచ్‌లను చూడాలని.. అక్కడికి వెళ్లి ఎంజాయ్​ చేయాలని చాలా మంది ఆశ పడుతుంటారు. కానీ.. ఖర్చు, అక్కడికి వెళ్లే విధానం గురించి తెలియక చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. మరి మీకు కూడా అండమాన్​ అందాలను చూడాలనుందా? అయితే, మీకోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

LTC స్పెషల్​ అండమాన్ ఎమరాల్డ్స్​ ఎక్స్​ విశాఖపట్నం​ పేరుతో ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో పోర్ట్ బ్లెయిర్, రోజ్​ ఐలాండ్​, నార్త్​బే ఐలాండ్​, హేవ్‌లాక్ ఐలాండ్, నెయిల్​ ఐలాండ్ లాంటి పర్యాటక ప్రాంతాలను విజిట్​ చేయవచ్చు. విశాఖపట్నం నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ఈ టూర్​ను ఆపరేట్​ చేస్తున్నారు. ఈ టూర్​ 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగుతుంది. ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు వైజాగ్​ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 08.35 గంటలకు విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి ఫ్లైట్​ స్టార్ట్​ అవుతుంది. మధ్యాహ్నానికి పోర్ట్ బ్లెయిర్ చేరుకుంటారు. ఎయిర్​పోర్ట్​ ఫార్మాలిటీస్​ పూర్తయిన తర్వాత అక్కడి నుంచి ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. హోటల్​లో చెకిన్ అయ్యాక సెల్యూలార్ జైల్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. తర్వాత కోర్బికోవ్​ బీచ్‌కు వెళ‌తారు. ఆ సాయంత్రం సెల్యూలార్​ జైల్​ వద్ద లైట్​ అండ్​ సౌండ్​ షో విజిట్​ చేస్తారు. ఆ రాత్రికి పోర్ట్ బ్లెయిర్‌లోనే భోజనం, స్టే ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం టిఫెన్​​ తర్వాత రోస్​​ ఐలాండ్​ అండ్​ నార్త్​ బే విజిట్​ చేస్తారు. అక్కడ పలు యాక్టివిటీస్​లో పాల్గొనొచ్చు. తిరిగి పోర్ట్​ బ్లెయిర్​కు చేరుకుని లంచ్​ పూర్తి చేసిన తర్వాత సాముద్రిక మెరైన్​ మ్యూజియం విజిట్​ చేస్తారు. ఆ రాత్రికీ పోర్ట్​ బ్లెయిర్​లో స్టే చేయాలి.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి హావ్‌లాక్ ఐలాండ్​కు వెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత.. సాయంత్రం రాధానగర్ బీచ్ చూస్తారు. ఆ రాత్రి హావ్‌లాక్‌లోనే బస ఉంటుంది.
  • నాలుగో రోజు బ్రేక్ ఫాస్ట్ అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి.. కాలాపత్తర్ బీచ్ విజిట్​ చేస్తారు. నెయిల్​ ఐలాండ్ కోసం ప్రీమియం క్రూయిజ్ ఎక్కాల్సి ఉంటుంది. అక్కడకు చేరుకున్న తర్వాత హోటల్​లో చెక్ ఇన్ అవ్వాలి. తర్వాత నేచురల్​ బ్రిడ్జ్​, లక్ష్మణపూర్ బీచ్ సందర్శన ఉంటుంది. ఆ రాత్రికి నీల్ ఐలాండ్‌లోనే డిన్నర్, స్టే ఉంటుంది.
  • ఐదో రోజు ఎర్లీ మార్నింగ్​ భరత్​పూర్​ బీచ్​లో సూర్యోదయాన్ని చూడొచ్చు. బ్రేక్​ఫాస్ట్​ అనంతరం హోటల్​ నుంచి చెక్ అవుట్​ అయ్యి.. క్రూయిజ్ ద్వారా పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరాలి. సాయంత్రం షాపింగ్ కోసం టైమ్ ఉంటుంది. పోర్ట్ బ్లెయిర్‌లో రాత్రి భోజనం, బస ఉంటుంది.
  • ఆరో రోజు ఉదయం టిఫెన్​ చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అనంత‌రం పోర్ట్ బ్లెయిర్‌ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాలి. ఉద‌యం 07:25 గంటలకు వైజాగ్​ వెళ్లే విమానం ఉంటుంది. 11:45 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ధర వివరాలు చూస్తే..

  • కంఫర్ట్​లో సింగిల్​ ఆక్యూపెన్సీకి రూ. 75,115, డబుల్​ ఆక్యూపెన్సీకి రూ. 58,860, ట్రిపుల్​ ఆక్యూపెన్సీకి రూ.57,230 చెల్లించాలి.
  • 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.50,270 చెల్లించాలి అదే విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ. 46,810 పే చేయాలి.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ఫ్లైట్​ టికెట్లు(వైజాగ్​​ - పోర్ట్ బ్లెయిర్​ / పోర్ట్ బ్లెయిర్​ - వైజాగ్​​)
  • హోటల్​ అకామిడేషన్​
  • ట్రాన్స్​పోర్ట్​ కోసం వెహికల్​
  • 5 బ్రేక్​ఫాస్ట్​లు, 5 డిన్నర్​లు ఉంటాయి.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • ప్రస్తుతం ఈ టూర్​ ప్యాకేజీ డిసెంబర్​ 5వ తేదీన అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​ పై క్లిక్​ చేసి తెలుసుకోండి.

IRCTC దిల్లీ టూర్​ - రెడ్​ఫోర్ట్​, తాజ్​మహల్​​ సహా ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు - ధర కూడా తక్కువే!

IRCTC సూపర్​ ప్యాకేజీ - బ్యాంకాక్​లో ఫుల్​ ఎంజాయ్​ చేయవచ్చు! - సఫారీ వరల్డ్ టూర్ కూడా!

కార్తికమాసంలో జ్యోతిర్లింగాలు దర్శించుకునేందుకు వీలుగా - IRCTC సూపర్​ ప్యాకేజీ - ధర తక్కువే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.