How To Make Tasty Sambar : వేడివేడి సాంబార్ అంటే మనందరికీ ఇష్టమే. ఇంట్లో ఏ కర్రీ చేయకపోయినా.. కేవలం సాంబార్ ఉంటే చాలు ఆ పూట తృప్తిగా అన్నం తినొచ్చు. అయితే.. చాలా మంది ఇంట్లో సాంబార్ చేస్తారు కానీ.. టేస్ట్ మాత్రం అంత గొప్పగా ఉండదు! ఇందులోకి ఏదో మిస్ అయ్యింది.. అందుకే సాంబార్ రుచిగా రాలేదని అనుకుంటుంటారు. ఇలా సాంబార్ రుచిగా చేయడం రానివారు.. ఒక్కసారి ఈ పద్ధతిలో చేస్తే రుచి అద్దిరిపోతుంది. మరి, ఇక ఆలస్యం చేయకుండా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే టేస్టీ సాంబార్ ఎలా చేయాలో ఓ లుక్కేయండి.
కావాల్సిన పదార్థాలు :
- కంది పప్పు - కప్పు
- క్యారెట్ ముక్కలు - కప్పు
- బెండకాయలు-3
- మునగకాయ ముక్కలు - కప్పు
- వంకాయలు - 3
- నూనె
- పచ్చిమిర్చి - 5
- సొరకాయ ముక్కలు-కప్పు
- టమాటాలు-2
- ఉల్లిపాయలు-2
- చింతపండు- 50 గ్రాములు
- ఉప్పు - రుచికి సరిపడా
- ఎండు మిరపకాయలు -2
- పసుపు- టీ స్పూన్
- కారం-2టేబుల్‌స్పూన్లు
- సాంబార్ పౌడర్-టేబుల్‌స్పూన్
- గరం మసాలా-టేబుల్‌స్పూన్
- కొత్తిమీర - కొద్దిగా
- నీరు సరిపడా
- ఆవాలు - టీ స్పూన్
- జీలకర్ర - టీ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు-5
- కరివేపాకు -2 రెమ్మలు
తయారీ విధానం..
- ముందుగా కూరగాయలను శుభ్రంగా నీటిలో కడిగి.. ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు కందిపప్పుని రెండు సార్లు కడగాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో పప్పు వేసుకోవాలి.
- ఇందులో కొద్దిగా ఉప్పు, టేబుల్‌స్పూన్ నూనె, రెండు గ్లాసుల వాటర్ పోసుకుని మెత్తగా ఉడికించుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై సాంబార్ చేయడం కోసం ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులో 4 టేబుల్స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి.
- నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి వేసి వీటిని బాగా వేయించుకోవాలి.
- ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత.. కూరగాయలన్నీ వేసి మిక్స్ చేయాలి.
- తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి.. గిన్నెపై మూతపెట్టండి. సాంబార్‌లోకి వేసిన కూరగాయలను సగానికి పైగా ఉడికించుకోవాలి.
- ఇప్పుడు చిక్కటి చింత పండు రసం పోసుకోవాలి. అలాగే ఉడికించుకున్న పప్పు వేసి మిక్స్ చేయాలి.
- ఈ సమయంలో సాంబార్కి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు స్టౌ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి సాంబార్ 15 నిమిషాలు మరిగించుకోవాలి.
- తర్వాత సాంబార్లో కారం, సాంబార్ పౌడర్, గరం మసాలా వేసి మిక్స్ చేయాలి. ఈ టైమ్‌లోనే సాంబార్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, పులుపు చూసుకోవాలి. (ఎందుకంటే ఇవి మూడు సరిగ్గా ఉంటేనే సాంబార్ రుచిగా ఉంటుంది.)
- తర్వాత సాంబార్ 5 నిమిషాలు మరిగించుకోవాలి.
- స్టౌ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే రుచికరమైన సాంబార్ రెడీ.
- నచ్చితే మీరు కూడా ఇలా ఇంట్లో సాంబార్ ట్రై చేయండి. ఇంట్లో వాళ్లందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
ఇవి కూడా చదవండి :
నిమిషాల్లో ప్రిపేర్ అయ్యే ఆంధ్ర స్టైల్ "పప్పు చారు" - ఇలా చేస్తే తినడమే కాదు తాగేస్తారు కూడా!
ఇంట్లోనే ఘుమఘుమలాడే "ఉడిపి సాంబార్" - ఇడ్లీ, వడల్లోకి సూపర్ కాంబినేషన్ - ఇలా చేసేయండి!