ETV Bharat / international

ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలుకుతాం- చర్చలకు అంగీకరించిన పుతిన్ : ట్రంప్ - TRUMP PUTIN PHONE CALL

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం గురించి పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌

Trump Putin Phone Call
Donlad Trump ,Vladimir Putin (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2025, 7:18 AM IST

Trump Putin Phone Call : ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు దిశగా తమ బృందంతో చర్చలు జరిపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అంగీకారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఈ విషయంలో ఇద్దరం కలిసి పని చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. ఈ మేరకు పుతిన్​తో ఫోన్​లో మాడినట్లు ట్రంప్ తన సామాజిక మాధ్యమం ద్వారా పోస్టు చేశారు.

'కలిసి పని చేయడం వల్ల ఏదో ఒక రోజు గొప్ప లబ్ది చేకూరుతుంది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల ఇప్పటికే చాలా నష్టం వాటిల్లింది. యుద్ధంలో లక్షల మంది ప్రాణ నష్టాన్ని అరికట్టాలని అంగీకారానికి వచ్చాం. తక్షణమే చర్చలు మొదలు పెట్టేందుకు ఇరువురం అంగీకరించాం. కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాం. కామన్ సెన్స్‌ నినాదాన్ని ఇద్దరం గట్టిగా నమ్ముతున్నాం. ఒకరి దేశానికి మరొకరు సందర్శనకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డాలర్‌ తదితర అంశాలతో పాటు ఇరుదేశాల బలాబలాల గురించి మాట్లాడుకున్నాం' అని రష్యాలో బందీగా ఉన్న అమెరికా టీచర్ మార్క్‌ ఫోగెల్‌ విడుదల అనంతరం పుతిన్‌తో మాట్లాడినట్లు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేందుకు సిద్ధమైన అమెరికా జెలెన్‌ స్కీకి కీలక సూచనలు చేస్తోంది. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇచ్చేదిలేదని స్పష్టమైన సంకేతాలు పంపింది. అలాగే రష్యా స్వాధీనం చేసుకున్న అన్ని భూభాగాలను తిరిగి దక్కించుకోవాలనే ఆశను వదులుకోవాలని సూచించింది. అంతర్జాతీయ మద్దతుతో చర్చల ద్వారా శాంతియుత పరిష్కారానికి సిద్ధం కావాలని అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సేత్ స్పష్టంచేశారు. ఉక్రెయిన్ రక్షణ కోసం ఐరోపా దేశాలు ఆర్థిక, సైనిక సహకారం అందించాలని కోరారు. శాంతిదళాలను కూడా పంపాలని సూచించారు. అయితే అమెరికా బలగాలు ఉండబోవని స్పష్టంచేశారు. ఇక రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య పోరాటాన్ని ఆపేందుకు తన రాయబారి కీత్ కెల్లాగ్‌ను త్వరలో కీవ్‌కు పంపనున్నట్లు ట్రంప్ ఇటీవల తెలిపారు. ఇక, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వచ్చే వారం మ్యానిచ్‌లో జెలెన్‌స్కీతో భేటీ అవుతారని అక్కడి అధికారి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.