ETV Bharat / entertainment

ఫారెస్ట్​లో హీరోల అడ్వెంచర్స్- ఇప్పుడు ఇదే టాలీవుడ్ ట్రెండ్‌ - FOREST BACKDROP TELUGU MOVIES

అడవి బాట పట్టిన తెలుగు హీరోలు- ఈ నేపథ్యంలో రాబోతున్న తెలుగు సినిమాలివే!

Forest Backdrop Movies
Forest Backdrop Movies (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2025, 10:45 AM IST

Forest Backdrop Telugu Movies : టాలీవుడ్​లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ సృష్టించేందుకు పలువురు తెలుగు హీరోలు అడవి బాట పట్టారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్​తో కూడిన కథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధం అవుతున్నారు. మరెందుకు ఆలస్యం అడవి నేపథ్యంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

  • ఆఫ్రికన్‌ అడ్వెంచర్‌ : రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఆఫ్రికన్‌ అడవుల్లో వేటకు మహేశ్ సిద్ధమవుతున్నారు. రచయిత కె. విజయేంద్రప్రసాద్‌ ఈ చిత్రానికి కథ అందించారు. యాక్షన్ అడ్వెంచర్​గా ఈ సినిమాను జక్కన్న తెరకెక్కిస్తున్నారు.
  • కన్నప్ప : మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'కన్నప్ప'. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలోనే తెరకెక్కుతోంది. 2025 ఏప్రిల్‌ లో ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప విడుదల కానుంది.
  • మాస్ లుక్​లో శర్వా : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్- దర్శకుడు సంపత్ నంది కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్​లోనే తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ తెలంగాణ యాసలో మాట్లాడుతారని, పల్లెటూరి వ్యక్తిగా, మాస్​గా కనిపిస్తారని సమాచారం. ఈ ఏడాది ఆఖర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.
  • అనుష్క కూడా : దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క- క్రిష్ కాంబోలో వస్తున్న మూవీ 'ఘాటీ'. ఈ సినిమా ఆంధ్ర- ఒడిశా ఫారెస్ట్ బ్రాక్ డ్రాప్​లో జరిగే క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతోంది. అటవీ ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
  • బెల్లంకొండ శ్రీనివాస్ : యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్- దర్శకుడు కౌశిక్ పెగెల్లపాటి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో హారర్- థ్రిల్లర్​గా రూపొందుతోంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ నటిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

'SSMB' షూటింగ్ లొకేషన్ కోసం జక్కన్న సెర్చింగ్! - వైరల్ అవుతున్న ఇన్​స్టా పోస్ట్!

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్ట్ - 'కన్నప్ప' రిలీజ్‌ డేట్ ఫిక్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.